Neha Sharma: నేహాశర్మ.. కొత్త అవతారం! ఏకంగా ఆ హీరోతో
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:18 PM
చిరుత సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నేహా శర్మ ఆ తరువాత పెద్దగా హిట్‌లు అందుకోలేక పోయింది.
రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నేహా శర్మ (Neha Sharma). ఆ తరువాత పెద్దగా హిట్‌లు అందుకోలేకపోయింది. తెలుగు, హిందీ భాషల్లో కొన్ని సినిమాలు చేసినా, స్టార్‌డమ్ మాత్రం అందుకోలేదు. అయితే తన గ్లామరస్ ఫొటోషూట్లతో, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నేహా ఎప్పటికప్పుడు లైమ్‌లైట్‌లో నిలిచింది. యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకోగలిగింది. ఆ మథ్య ఓ మూడు నాలుగు వెబ్ సిరీస్‌లు కూడా చేసి ప్రేక్షకులకు దగ్గరూంది.
అయితే.. ఈ భామ ఇప్పుడు సరి కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోంది . తాజా సమాచారం ప్రకారం, నేహా శర్మ దర్శకురాలిగా కొత్త అవతారం ఎత్తబోతోంది. అది కూడా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ (Ajay Devgn) నిర్మిస్తున్న భారీ బడ్జెట్ పీరియడ్ క్రియేచర్ డ్రామా (period creature drama)తో కావడం విశేషం.
ఈ చిత్రం 1945 నాటి స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో సాగనుండగా సిద్ధాంత్ చతుర్వేది (Siddhant Chaturvedi), మొహిత్ రైనా (Mohit Raina) ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. 2026లో ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ద్వారా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
నటిగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన నేహా (Neha Sharma) ఈసారి దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకో బోతోంది. ఈ సినిమాతో ఆమెకు మంచి బ్రేక్ దొరుకుతుందా లేదా అన్నది చూడాలి. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ బయటకు రానున్నాయి.