సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: రవితేజ, నవీన్ పోలిశెట్టిలతో మల్టీస్టారర్

ABN, Publish Date - Oct 29 , 2025 | 01:43 PM

రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఇప్పుడో మల్టీస్టారర్ మూవీకి కథను రెడీ చేశాడు. ఇందులో రవితేజ, నవీన్ పోలిశెట్టి నటించబోతున్నట్టు సమాచారం.

Ravi Teja, Naveen Polisetti

తెలుగులోనూ మల్టీస్టారర్ హీరోల ట్రెండ్ జోరుగా సాగుతోంది. వెంకటేశ్ (Venkatesh), నాగార్జున (Nagarjuna) వంటి స్టార్స్ మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తాజాగా రవితేజ (Raviteja) సైతం అలాంటి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రముఖ కథ, మాటల రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ (Bezawada Prasanna Kumar) చెప్పిన కథకు మాస్ మహరాజా ఓకే చెప్పాడట. ఇందులో మరో కీలక పాత్రను ఎవరైనా హీరోతో చేయించాల్సి ఉందట. ఈ పాత్రను నవీన్ పోలిశెట్టి (Naveen Polisetty) చేస్తే బాగుంటుదని భావించిన బెజవాడ ప్రసన్న కుమార్ అతన్ని అప్రోచ్ అయ్యాడని, రవితేజతో పాటు ఈ సినిమాలో నటించడానికి నవీన్ పోలిశెట్టి సైతం ఒప్పుకున్నాడని అంటున్నారు. సో... అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.


ఇదిలా ఉంటే... బుల్లితెర లో పాపులర్ షో 'జబర్దస్త్' లో స్క్రిప్ట్ రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న బెజవాడ ప్రసన్న కుమార్ ఆ తర్వాత వెండితెరపైకి వచ్చాడు. రచయితగా ఇక్కడా మంచి గుర్తింపే పొందాడు. కొంతకాలంగా దర్శకత్వం వహించాలని ప్రసన్న కుమార్ ట్రై చేస్తున్నాడు. నిజానికి నాగార్జున హీరోగా ప్రసన్న కుమార్ దర్శకత్వంలో సినిమా రాబోతోందని రెండేళ్ళ క్రితం ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కారణాలు ఏవైనా అది పట్టాలెక్కలేదు. అయితే గత యేడాది సంక్రాంతికి వచ్చని 'నా సామిరంగ' అనే రీమేక్ మూవీకి బెజవాడ ప్రసన్న కుమార్ రచన చేశాడు. దాంతో నాగార్జున వందో సినిమా అతనితో ఉండొచ్చని అన్నారు కానీ అదీ జరగలేదు. ఇప్పుడు మాత్రం రవితేజ, నవీన్ పోలిశెట్టితో బెజవాడ ప్రసన్న కుమార్ సినిమా ఉంటుందని చెబుతున్నారు. అయితే దీనికి కూడా అతన్ని కేవలం రచయితగానే ఉంచేస్తారా? లేకపోతే మెగా ఫోన్ అతని చేతికి ఇస్తారా? అనేది చూడాలి. అతని సన్నిహితులు మాత్రం. రవితేజ, నవీన్ పోలిశెట్టి మూవీకి బెజవాడ ప్రసన్న కుమారే దర్శకుడు అని చెబుతున్నారు. అదే జరిగితే... అల్టిమేట్ ఎంటర్ టైన్ మెంట్ ను అందించే ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటే... ఆ మూవీ ఒక రేంజ్ లో ఉండటం ఖాయం. ప్రస్తుతం రవితేజ నటించిన 'మాస్ జాతర' నెలాఖరులో జనం ముందుకు రాబోతోంది. అలానే నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' సంక్రాంతికి కానుకగా విడుదల అవుతోంది. మరి వీరిద్దరి కాంబోలో మూవీ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

Also Read: Bad boy Karthik: అంద‌మైన ఫిగ‌ర్ నువ్వా.. అంటున్న ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌’

Also Read: Ram Potineni: ముందే రాబోతున్న.. 'ఆంధ్ర కింగ్ తాలూకా'

Updated Date - Oct 29 , 2025 | 06:08 PM