Ram Potineni: ముందే రాబోతున్న.. 'ఆంధ్ర కింగ్ తాలూకా'

ABN , Publish Date - Oct 29 , 2025 | 12:52 PM

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న 'ఆంధ్రా కింగ్ తాలూకా' మూవీ ఒకరోజు ముందే విడుదల కాబోతోందని ఫిల్మ్ నగర్ సమాచారం.

Andhra King Tarluka movie

ప్రస్తుతం ఏ సినిమా కూడా ముందు అనుకున్న విధంగా విడుదలకు నోచుకోవడం లేదు. నెలా రెండు నెలలు కాదు ఏకంగా మూడు నాలుగు నెలలు వాయిదా పడిపోతోంది. చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలదీ ఇదే పరిస్థితి. డిసెంబర్ లో రావాల్సిన అడివి శేష్‌ (Adivi Sesh) 'డెకాయిట్'(Dacoit) మూవీ ఏకంగా మూడు నెలలకు వాయిదా పడింది. అయితే చిత్రంగా కొన్ని సినిమాలు ఒకటి రెండు రోజుల ముందో, వారం ముందో వచ్చేస్తున్నాయి కూడా. అలా ఆ మధ్య 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) మూవీ ఓ వారం ముందే వచ్చేసింది. మంచి విజయాన్ని అందుకుంది. అలానే ఇప్పుడు రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' (Andhra King Taluka) కూడా కాస్తంత ముందుగానే వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా మామూలుగా అయితే నవంబర్ 28న విడుదల కావాల్సి ఉంది. సహజంగా విడుదల తేదీకి ఒక రోజు ముందు యు.ఎస్.ఎ.లో ప్రీమియర్స్ వేస్తుంటారు. కానీ 'ఆంధ్రా కింగ్ తాలూకా' మూవీకి అమెరికాలో ప్రీమియర్స్ నవంబర్ 26నే వేసేస్తున్నారు. సో... ఈ సినిమా నవంబర్ 27నే జనం ముందుకు వస్తోందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని నిర్మాతలు ఇంతవరకూ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రాన్ని మహేశ్ బాబు (Mahesh Babu) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) ఇందులో హీరోయిన్ గా నటించింది. ఆంధ్ర కింగ్ గా ఉపేంద్ర (Upendra) నటించారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సింగిల్స్ రాగా మూడోది అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది.


ఇదిలా ఉంటే... రవితేజ (Raviteja) తాజా చిత్రం 'మాస్ జాతర' అక్టోబర్ 31న విడుదల కావాల్సింది. కానీ 'బాహుబలి - ది ఎపిక్' కోసం ఈ సినిమాను ఒక రోజు వెనక్కి తీసుకెళ్ళారు. నవంబర్ 1 నుండి అన్ని థియేటర్లలో నాలుగు ఆటల చొప్పున ప్రదర్శించబోతున్నారు. అక్టోబర్ 31న మాత్రం సాయంత్రం ప్రీమియర్ షోస్ వేస్తారని చెబుతున్నారు. సో... ఇప్పుడు ఏ సినిమా ఏ తేదీ ఏ సమయంలో విడుదల అవుతోందో కూడా కాస్తంత జాగ్రత్తగా తెలుసుకుని థియేటర్లకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది.

Also Read: Mahesh Babu: హీరోయిన్‌గా.. మ‌హేశ్‌బాబు మేన కోడలు! ఎంట్రీకి రంగం సిద్ధం

Also Read: The Taj Story: తాజ్‌మ‌హాల్ వివాదాల నేప‌థ్యంలో సినిమా.. రిలీజ్‌కు ముందు అడ్డంకులు రిలీజ‌య్యేనా

Updated Date - Oct 29 , 2025 | 01:27 PM