The Girlfriend: ఏం జరుగుతోంది.. 26న‘ది గర్ల్ ఫ్రెండ్’ సెకండ్ సింగిల్
ABN , Publish Date - Aug 24 , 2025 | 06:05 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend) చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నదివే అనే పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా ఇప్పుడు ఏం జరుగుతోంది అంటూ చిన్మయా శ్రీ పాద (Chinmayi Sripaada) ఆలపించిన పాటను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఆదివారం ఓ పోస్టర్ రిలీజ్ చేసి వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 26న ఈ పాటను విడుదల చేయనున్ననట్లు ప్రకటించారు.
గతంలో చిలసౌ, మన్మథుడు 2 వంటి సినిమాలను తెరకెక్కించిన రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ఈ మూవీకి దర్శకుడు. గీతా ఆర్ట్స్ (Geetha Arts) నిర్మిస్తోంది.హేషమ్ అబ్దుల్ వాహబ్ ( Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో రష్మికకు జోడీగా కన్నడ నటుడు నాని దసరాఫేం దీక్షిత్ శెట్టి ( Dheekshith Shetty) నటిస్తున్నాడు. ఇదిలాఉంటే రష్మిక బాలీవుడ్‌లో ప్రస్తుతం రెండు చిత్రాలు చేస్తోండగా తెలుగులో మైసా అనే చిత్రం ప్రారంభమైంది.