Neeraja Kona: తెలుసు కదా షూటింగ్ పూర్తి చేసుకున్న రాశీఖన్నా...
ABN , Publish Date - Sep 08 , 2025 | 09:32 AM
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమా 'తెలుసు కదా'. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్. ఇందులో రాశీ ఖన్నా షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది.
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'తెలుసు కదా' (Telusu Kada). ఇందులో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన (Neeraja Kona) దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు.
'తెలుసు కదా' జర్నీ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ, 'కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా మరిచిపోలేని కథలు ఉంటాయి. ‘తెలుసు కదా’ అలాంటి కథల్లో ఒకటి. అద్భుతమైన అనుభవాలన్నీ కలగలిసిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన అద్భుతమైన టీంకి కృతజ్ఞతలు. మేం సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజుకోసం ఎదురుచూస్తున్నాను. ఇది మీకు ఒక గొప్ప రైడ్‌గా ఉంటుంది' అని పేర్కొంది. థమన్ (Thaman S) సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన 'మల్లిక గంథా...' సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జ్ఞానశేఖర్ వి.ఎస్. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కాగా జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 17న దీపావళి కానుకగా జనం ముందుకు రాబోతోంది.
Also Read: Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లో శృంగార తారల హంగామా...
Also Read: Monday Tv Movies: సోమవారం.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే