Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లో శృంగార తారల హంగామా...

ABN , Publish Date - Sep 08 , 2025 | 08:42 AM

తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఈసారి కూడా శృంగార తారలు చోటు సంపాదించుకున్నారు. ఆశా సైనీతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్న సంజనా గల్రానీకీ అలాంటి ఇమేజే ఉండటం విశేషం.

Bigg Boss season 9

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) మొదలైపోయింది. అయితే లాస్ట్ సీజన్ తో పోల్చితే... ఈ సీజన్ కాస్తంత ఆసక్తికరంగానే ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పేర్లే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ లోనూ కనిపించాయి. లాస్ట్ టైమ్ తో చూసుకుంటే ఈసారి కొన్ని తెలిసిన ముఖాలే బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో పెట్టే పోటీలు మరీ దారుణంగా ఉంటున్నాయని, లీన్ కంటెస్టెంట్స్ కొన్ని టాస్క్ ల కారణంగా గాయాల పాలు అవుతున్నారని కంప్లయిట్స్ వస్తున్నాయి. అలానే పర్సనల్ క్రిటిసిజమ్ కూడా హద్దులు దాటిపోతోందనే మాట వినిపిస్తోంది. వీటన్నింటినీ తట్టుకుని రాటుదేలే విధంగా బిగ్ బాస్ హౌస్ ఉంటుందని అంటున్నారు. కానీ సమాజంలో ఇప్పటికే అలా రాటు దేలిన వారినే బిగ్ బాస్ ఎంపిక చేస్తున్నాడేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు.


ఉదాహరణకు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన శృంగార తారలనే తీసుకుంటే... వాళ్ళంతా ఈ కష్టాలను ఎప్పుడో ఎదుర్కొని సమాజం నుండి వచ్చిన సమస్యలను దాటుకుని ఈ స్థాయికి చేరుకున్న వాళ్ళే. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఆశా సైనీ (ఫ్లోరా సైనీ) (Aasha Saini) కూడా ఇప్పుడు శృంగార తారగానే గుర్తింపు పొందింది. సెమీ పోర్న్ వెబ్ సీరిస్ లో నటిస్తూ... జాతీయ స్థాయిలో తనకంటూ కొంతమంది అభిమానుల్ని ఏర్పరుచుకుంది.

snapins-ai_3716481195246305907.jpg

వీర శంకర్ (Veera Sankar) దర్శకత్వం వహించిన 'ప్రేమకోసం' (Premakosam) సినిమాతో 1999లో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆశాసైనీ ఆ పైన స్టార్ హీరోల సినిమాల్లోనూ చేసింది. కానీ ఆశించిన స్థాయిలో బ్రేక్ రాకపోవడంతో ఇప్పుడు సెమీ పోర్న్ స్టార్ గా మారిపోయింది.

snapins-ai_3716481195237908949.jpg


సీజన్ 7లో బిగ్ బాస్ షోలో పాల్గొన్న షకీలా గురించి చెప్పక్కర్లేదు! ఆంధ్రపదేశ్ లో పుట్టిన షకీలా (Shakeela) మలయాళ చిత్రసీమను పోర్న్ స్టార్ గా ఓ ఊపు ఊపేసింది. ఆమె సినిమా విడుదల అవుతుంటే... మోహన్ లాల్, మమ్ముటి వంటి సీనియర్ స్టార్స్ సైతం భయపడే పరిస్థితి నెలకొంది. పలు తెలుగు చిత్రాలలో నటించిన షకీలా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడమే అప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. అదే సీజన్ లో పాల్గొన్న కిరణ్ రాథోడ్ (Kiran Rathod) కూడా 2001లో తెలుగు సినిమా 'శుభకార్యం'తో కెరీర్ ప్రారంభించింది. పలు భాషల్లో సినిమాలు చేసినా... ఆశించిన స్థాయి గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఈమె కూడా సెమీ పోర్న్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... యువతకు గాలం వేసే పనిలో పడింది. సీజన్ 6లో పాల్గొన్న అభినయశ్రీ (Abhinayasri), ఫస్ట్ సీజన్ లో దుమ్ము రేపిన ముమైత్ ఖాన్ (Mumaith Khan) కూడా శృంగార తారలుగా మంచి గుర్తింపు ఉన్నవారే. అలానే ఇందులో పాల్గొన్న సరయు, పూజా రామచంద్రన్, సంజన గల్రానీ కీ సెక్సీ యాక్ట్రస్ గా పేరుంది. వీరంతా జీవితంలో పడాల్సిన కష్టాలన్నీ పడి, రాటు దేలిన తర్వాతే బిగ్ బాస్ షోకు వచ్చారు.

ఏదేమైనా... ప్రతిభాపాటవాల కంటే సెన్సేషనలిజమ్ కే బిగ్ బాస్ ప్రాధాన్యం ఇస్తాడని, ఇలాంటి కంటెస్టెంట్స్ ను చూస్తే అర్థం అవుతుంది. హిందీ బిగ్ బాస్ కూడా ఇందుకు అతీతం ఏమీ కాదు... అక్కడ కూడా సన్నీ లియోన్ వంటి పోర్న్ స్టార్స్ కొందరు పాల్గొన్నారు. సీపీఐ నేత నారాయణ విమర్శించడం కాదు కానీ ఇలాంటి కొందరి వల్ల, అతిగా ప్రవర్తించే మరి కొందరి వల్ల బిగ్ బాస్ ను ఫ్యామిలీతో కలిసి చూడలేకపోతున్నామనే విమర్శలు సీజన్ సీజన్ కూ పెరుగుతున్నాయి. మరి ఈసారి ఎలా ఉంటుందో చూడాలి!

Also Read: Biggboss 9: గ్రాండ్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 9 .. ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే

Also Read: Monday Tv Movies: సోమ‌వారం.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే తెలుగు సినిమాలివే

Updated Date - Sep 08 , 2025 | 08:42 AM