Telusu Kada: మల్లిక గంధ.. నచ్చేసిందోయ్
ABN , Publish Date - Jul 28 , 2025 | 08:24 PM
టిల్లు స్క్వేర్ తరువాత సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)కు ఒక్క హిట్ కూడా పడలేదు. ఈ ఏడాది జాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Telusu Kada: టిల్లు స్క్వేర్ తరువాత సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)కు ఒక్క హిట్ కూడా పడలేదు. ఈ ఏడాది జాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో పాటు నిర్మాతలకు భారీ నష్టాన్ని అందించింది. ఇక ప్రస్తుతం సిద్దు నటిస్తున్న చిత్రాల్లో తెలుసు కదా( Telusu Kadha) ఒకటి. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా మారి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సిద్దు సరసన రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా తెలుసు కదా చిత్రం నుంచి మొదటి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మల్లిక గంధా అంటూ సాగిన ఈ సాంగ్ చార్ట్ బస్టర్ అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంత అద్భుతంగా ఉంది సాంగ్. థమన్ మ్యూజిక్ చాలా అంటే చాలాబ్రిలియంట్ గా వుంది. తంబురా, ఫ్లూట్ లాంటి ట్రెడిషనల్ వాయిద్యాల్ని మోడరన్ టచ్ లో వినిపించడం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే సిద్ శ్రీరామ్ వాయిస్ ఇంకోఎత్తు.
కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ ను తన గాత్రంతో మెస్మరైజ్ చేశాడు సిద్. ఇక వీడియోలో సిద్దు, రాశీ రొమాన్స్.. క్యూట్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. మొదటి సినిమానే అయినా నీరజ కోనా.. టేకింగ్ చాలా అద్భుతంగా ఉంది. టోటల్ గా మొదటి సాంగ్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సిద్దు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Sanjay Dutt: పరులసొమ్ము పాములాంటిది.. రూ. 72 కోట్ల ఆస్తి తిరిగిచ్చేసిన స్టార్ హీరో
Director Vikranth Rudhra: ఇన్ స్పైరింగ్ గా 'అర్జున్ చక్రవర్తి' టీజర్