Raashi Khanna:   మనమే తుపాను అయితే.. ఏ పిడుగు ఆపలేదు

ABN , Publish Date - May 20 , 2025 | 03:31 PM

తెరపై అందంగా కనిపించడానికి ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచడానికి తారలు ఎంతో కష్టపడుతుంటారు. షూటింగ్‌ సమయంలో ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతుంటాయి.


తెరపై అందంగా కనిపించడానికి ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచడానికి తారలు ఎంతో కష్టపడుతుంటారు. షూటింగ్‌ సమయంలో ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతుంటాయి. గాయాలను సైతం లెక్క చేయకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే లక్ష్యంగా పని చేస్తుంటారు. తాజాగా నటి రాశీఖన్నాకు (Raashii Khanna)షూటింగ్‌లో గాయాలయ్యాయి. ఈ  విషయాన్ని చెబుతూ ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘కథ డిమాండ్‌ చేస్తే గాయాలను కూడా లెక్క చేయకూడదు. మనమే ఒక తుపాను అయినప్పుడు మనల్ని ఏ పిడుగు ఆపలేదు’ అని క్యాప్షన్‌ పెడుతూ గాయాలైన ఫొటోలు షేర్‌ చేశారు. ఆమె చిన్న చిన్న దెబ్బలు తగిలినట్లు ఆ ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. (Raashii Khanna injured)

Raasi-khanna.jpg

అయితే ఆమెకు గాయాలలు ఎలా అయ్యాయి, ఎక్కడా అనేది చెప్పలేదు. నెటిజన్లు మాత్రం ‘ఫర్జీ 2’ (Farzi 2)షూటింగ్‌లో గాయాలయ్యాయా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. షాహిద్‌కపూర్‌, రాశీఖన్నా, విజయ్‌ ేసతుపతి కీలక  పాత్రధారులుగా నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఫర్జీ’. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైన ఈ సిరీస్‌ ఓటీటీలో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు దీని సీజన్‌ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైందని బాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. ఆ సెట్‌లోనే రాశీఖన్నాకు గాయాలైనట్లు తెలుస్తోంది. కొన్ని పాత్రలు నువ్వు ఇది చేయాలి అని అడగవు.. డిమాండ్‌ చేస్తాయి. బాడీ, బ్రీత్‌, గాయాలు ఇలా ఏదైనా సరే చేసుకుంటూ వెళ్లాల్సిందే. ‘కథ డిమాండ్‌ చేస్తే గాయాలను కూడా లెక్క చేయకూడదు. మనమే ఒక తుపాను అయినప్పుడు మనల్ని ఏ పిడుగు ఆపలేదు. త్వరలోనే వస్తున్నా’’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు రాశీఖన్నా.

Updated Date - May 20 , 2025 | 03:31 PM