సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mana Shankara Vara Prasad Garu: మన శంకర వరప్రసాద్ గారిని కలిసిన పూరిసేతుపతి

ABN, Publish Date - Sep 10 , 2025 | 03:42 PM

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu).

Mega Moment

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అందులో ఒకటి మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయన్ తార హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి అనిల్ చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అమాంతం హైప్ ను కూడా తీసుకొచ్చిపెట్టింది.


ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ మధ్యనే ఒక సాంగ్ షూట్ ను మొదలుపెట్టారని తెలుస్తోంది. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ సెట్ లో పూరి సేతుపతి టీమ్ సందడి చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టబు హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు.


పూరి సేతుపతి సినిమా కూడా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటుంది. ఇక రెండు షూటింగ్స్ పక్కనే జరుగుతున్నాయని తెలుసుకున్న పూరి.. చిరు సెట్ కు వెళ్లి ఆయనను కలిశారు. రెండు టీమ్స్ కొద్దిసేపు ముచ్చటించుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను పూరి కనెక్ట్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ' అద్భుతమైన మెగా మూమెంట్. మనశంకరవరప్రసాద్ గారు బృందం సెట్స్ లో మెగాస్టార్ ని కలిసే గౌరవం పూరిసేతుపతి టీమ్ కు లభించింది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి తారాగణంతో వేగంగా ముందుకు సాగుతోంది' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారాయి. మెగా మూమెంట్ అదిరింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

VarunTej Lavanya: వార‌సుడొచ్చాడు.. తండ్రైన మెగా హీరో!

VAYUPUTRA: కేవలం సినిమా కాదు, ఒక పవిత్ర దృశ్యం

Updated Date - Sep 10 , 2025 | 03:42 PM