VarunTej Lavanya: వారసుడొచ్చాడు.. తండ్రైన మెగా హీరో!
ABN , Publish Date - Sep 10 , 2025 | 02:15 PM
మెగా కుటుంబంలోకి కొత్తగా మరో వారసుడు వచ్చాడు.
మెగా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. మెగా కుటుంబంలోకి కొత్తగా మరో వారసుడు వచ్చాడు. వరుణ్ తేజ్ (varun tej), లావణ్య (Lavanya) దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. లావణ్య ఈ రోజు ఉదయం రెయిన్ బో హాస్పిటల్ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు వరుణ్ తేజ్-లావణ్య దంపతులకు, మెగా ఫ్యామిలీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఈ న్యూస్ తెగ వైరల్ అవుతూ ట్రెండింగ్‌లోకి వచ్చింది. సమాచారం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మూవీ సెట్ నుంచి ఆస్పత్రికి వెళ్లి వరుణ్ తేజ్, లావణ్యకు విషెస్ తెలిపారు.