Priyanka Chopra: తెలుగు నేర్చుకుంటున్న.. వారణాసి బ్యూటీ
ABN, Publish Date - Nov 18 , 2025 | 09:24 AM
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తెలుగు నేర్చుకుంటోంది. ప్రస్తుతం ఆమె రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. గత శనివారం ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో భారీగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కోసం ప్రియాంక తెలుగు ప్రాక్టీస్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘తగలబెట్టేద్దామా’ అంటూ క్యూట్‌గా మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సినిమాల్లో కంటే లైవ్‌లో తెలుగులో మాట్లాడడం చాలా కష్టం అంటోంది. ఈ క్యూట్ వీడియో మీరూ చూసేయండి.