Meera Vasudevan: మూడో భర్తకూ విడాకులిచ్చిన హీరోయిన్..

ABN , Publish Date - Nov 17 , 2025 | 09:45 PM

మలయాళ నటి మీరా వాసుదేవన్ (Meeraa Vasudevan) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి మీరా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Meera Vasudevan

Meera Vasudevan: మలయాళ నటి మీరా వాసుదేవన్ (Meeraa Vasudevan) పేరు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి మీరా మంచి గుర్తింపు సంపాదించుకుంది. మాధవన్ హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన 13 బి సినిమాలో కూడా మీరా నటించింది. అలా తెలుగువారికి కూడా ఆమె సుపరిచితమే. డబ్బింగ్ సినిమాగా తెలుగులో కూడా రిలీజైన 13బి ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

సినిమాలతో కంటే మీరా తన పెళ్లిళ్ల ద్వారానే బాగా ఫేమస్ అయ్యింది. 20 ఏళ్ళల్లో ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురికి విడాకులు ఇవ్వడం ఇండస్ట్రీని షేక్ చేసింది. తాజాగా ఆమె సింగిల్ అంటూ పోస్ట్ చేయడంతో మూడో భర్తకు కూడా విడాకులు ఇచ్చినట్లు కన్ఫర్మ్ అయ్యింది. మీరా.. 2005 లో విశాల్ అగర్వాల్ అనే వ్యక్తిని వివాహాం చేసుకుంది. అయితే ఈ జంట ఐదేళ్ల తరువాత 2010 లో విడిపోయారు. విభేదాల వలన విడిపోయినట్లు ఆమె చెప్పుకొచ్చింది.

ఇక రెండేళ్లు సింగిల్ గా ఉన్న మీరా.. 2012 లో జాన్ కొక్కెన్ ను వివాహామాడింది. కెజిఎఫ్ సినిమాలో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నజాన్ తెలుగువారికి సుపరిచితుడే. తెలుగు సినిమాల్లో విలన్ గా చాలా సినిమాల్లో నటించాడు. 2012 లో జాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది మీరా. వీరిద్దరి దాంపత్యం నాలుగేళ్లు సాగింది. 2016 లో ఈ జంట విడిపోయారు. ఇక ఇక్కడితో ఆగకుండా మీరా గతేడాది విపిన్ అనే సినిమాటోగ్రాఫర్ ను వివాహామాడింది. వీరైనా కలకాలం కలిసి ఉంటారు అనుకుంటే.. ముందువారిలా నాలుగేళ్లు కూడా ఉండకుండా ఏడాదికే విడాకులు ఇచ్చేసింది.

తాజాగా ఆమె తాను సింగిల్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకొచ్చింది. ' హాయ్.. నేను మీరా వాసుదేవన్.. ఆగస్టు నుంచి నేను సింగిల్ గా ఉంటున్నాను. నేను నా జీవితంలో అత్యంత అద్భుతమైన మరియు ప్రశాంతమైన దశలో ఉన్నాను' అంటూ రాసుకొచ్చింది. దీంతో విపిన్ తో కూడా ఆమె విడిపోయిందని కన్ఫర్మ్ అయ్యింది. 43 ఏళ్ల మీరా 20 ఏళ్ళల్లో మూడు పెళ్లిళ్లు చేసుకొని.. ముగ్గురికి విడాకులు ఇచ్చి సింగిల్ గా ఉండడం చాలామందికి ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Updated Date - Nov 17 , 2025 | 09:53 PM