Ram Pothineni: భాగ్యశ్రీతో ప్రేమ.. అదేంటి రామ్ అంత మాట అన్నాడు

ABN , Publish Date - Nov 17 , 2025 | 09:05 PM

ఇండస్ట్రీలో హీరో - హీరోయిన్ల మధ్య ప్రేమలు సాధారణమే. కొన్ని ప్రేమలు నిజమవుతాయి. కానీ, చాలావరకు రూమర్స్ గానే మిగిలిపోతాయి.

Ram Pothineni

Ram Pothineni: ఇండస్ట్రీలో హీరో - హీరోయిన్ల మధ్య ప్రేమలు సాధారణమే. కొన్ని ప్రేమలు నిజమవుతాయి. కానీ, చాలావరకు రూమర్స్ గానే మిగిలిపోతాయి. ఇక పెళ్లి కానీ హీరో అయితే.. ఆయన ఏ సినిమా చేస్తే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ తో ప్రేమ అంటూ రాసుకొచ్చేస్తూ. ఉంటారు ప్రస్తుతం టాలీవుడ్ హాట్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni)పరిస్థితి అలాగే ఉంది. గత కొన్నేళ్లుగా రామ్ పెళ్లిపై ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి.. రామ్ ఖండిస్తూనే ఉన్నాడు. కొన్నిసార్లు అయితే రామ్ పెళ్లి గురించి వాళ్ళింట్లో వాళ్లే భయపడేలా రాశారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

గత కొన్నిరోజుల నుంచి రామ్.. హీరోయిన్ భాగ్యశ్రీ ప్రేమలో మునిగి తేలుతున్నాడని, త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు పుట్టించారు. అందుకు కారణం వీరిద్దరూ ఒక హోటల్ లో ఉన్న ఫోటోలను వేరు వేరు సమయాల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే. ఇక వీరిద్దరూ కలిసి ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. నవంబర్ 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నువ్వుంటే చాలు సాంగ్ కు లిరిక్స్ అందించింది రామ్ నే. ఆ సాంగ్ కూడా భాగ్యశ్రీ కోసమే అని వార్తలు వచ్చాయి.

ఆంధ్రా కింగ్ తాలూకా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్.. వరుస ప్రమోషన్స్ తో బిజీగా మారాడు. ఇక ఈ ప్రమోషన్స్ లో రామ్.. భాగ్యశ్రీతో ప్రేమ, పెళ్లి వార్తలను ఖండించాడు. తమ మధ్య ప్రేమ ఉంది అన్న మాటల్లో ఎలాంటి నిజం లేదని, నిరాధారమైన వార్తలను నమ్మకండి అని చెప్పుకొచ్చాడు. ' అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తున్నాయో కూడా నాకు తెలియదు. ఇవన్నీ నిరాధారమైనవి. ఈ సినిమాలో నేను ఒక సాంగ్ రాసాను. ఆ సమయానికి హీరోయిన్ ను కూడా ఎంపిక చేయలేదు. అసలు అప్పటికే తెలియని అమ్మాయి కోసం సాంగ్ ఎలా రాస్తాను. ప్రస్తుతానికి నాకు లవ్ ఇంట్రెస్ట్ లేదు' అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అదేంటి.. లవ్ ఇంట్రెస్ట్ లేదు అంటాడు.. అసలు పెళ్లి చేసుకోడా.. అంత మాట అనేశాడేంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 17 , 2025 | 09:05 PM