Dulquer Salmaan: పూజా హెగ్డే స్థానంలో శ్రుతీహాసన్

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:15 PM

చిత్రసీమ అంటేనే చిత్రవిచిత్రాలకు నెలవు. కొందరు 'నో' అన్న సబ్జెక్ట్ మరికొందరికి 'ప్లస్' కావచ్చు. ఆశించిన అవకాశాలు చేజారవచ్చు. అనుకోని ఛాన్సులు వెదుక్కుంటూ రావచ్చు. ఇలా సినిమారంగంలో పలు విన్యాసాలు సాగుతూ ఉంటాయి. ఇప్పుడు ఓ సినిమా చుట్టూ ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు చక్కర్లు కొడుతూ ఉండడం విశేషంగా మారింది.

Shruthi Haasan - Pooja Hegde

తెలుగు సినిమాలతోనే సక్సెస్ చూసిన శ్రుతి హాసన్ (Shruthi Haasan) ఇప్పుడు ఇతర భాషల్లోనూ హిట్స్ పట్టేస్తున్నారు. ఇక టాలీవుడ్ లోనే భారీ విజయాలు నమోదు చేసుకున్న పూజా హెగ్డే (Pooja Hegde) వేరే చోట ఆ స్థాయిలో అలరించలేక పోయారు. ప్రస్తుతం శ్రుతిహాసన్- పూజా హెగ్డే పేర్లు ఓ సినిమా చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఆ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman). నూతన దర్శకుడు రవి నేలకుదిటి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అప్పట్లో పూజా హెగ్డే పేరు వినిపించింది. ఆమె కూడా 'రెట్రో' ప్రమోషన్స్ టైమ్ లో మళ్ళీ టాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్నానని చెప్పారు. అందరూ దుల్కర్ సినిమాతోనే పూజా కమ్ బ్యాక్ అవుతుందని భావించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో శ్రుతి హాసన్ నాయిక అని విశేషంగా వినిపిస్తోంది.


దుల్కర్ సినిమాలో పూజా హెగ్డే స్థానంలో శ్రుతిహాసన్ వచ్చి చేరిందని కొందరు అంటున్నారు. అయితే ఈ కథలో ఇద్దరు నాయికలకు స్కోప్ ఉందని పూజాతోపాటు శ్రుతి కూడా నటిస్తుందని చెబుతున్నారు. కాదు కాదని ఇంకొందరి వాదన. దీంతో పూజా ఔట్ - శ్రుతి ఇన్ అంటూ కథలు పుట్టుకొచ్చాయి. వాటికి కౌంటర్ గా దుల్కర్ సినిమాలో శ్రుతి హాసన్, పూజా హెగ్డే అనీ వినిపిస్తోంది. ఇలా ఎవరికి వారు కథలు చెబుతున్నా, అసలు విషయం చెప్పాల్సింది నిర్మాత సుధాకర్ చెరుకూరి కానీ, దర్శకుడు రవి అయినా తెలపాలి. ఇప్పటి దాకా వారేమీ చెప్పలేదు. దాంతో ఎవరికి వారు తమకు తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకూ ఈ సినిమాలో పూజా ఉంటుందా లేదా అన్నదే ప్రధానాంశం. ఆ విషయంలో క్లారిటీ ఎప్పుడు వస్తుందో మరి!

Also Read: Shalini Pandey: బికినీలో.. అర్జున్ రెడ్డి పాప అరాచ‌కం

Also Read: Ram Pothineni: 'ఆంధ్రకింగ్ తాలూకా' వచ్చేది ఎప్పుడంటే...

Updated Date - Aug 21 , 2025 | 05:16 PM

Dulquer Salmaan: అప్పుడు తెలుగు రాదన్నాను.. ఈరోజు ఇలా నిలబెట్టేశారు

Dulquer Salmaan : ‘లక్కీ భాస్కర్‌’ షురూ!

Shruthi Haasan: అడివి శేష్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌ కారణమా..

Pooja Hegde : ఆ కోరిక ఇప్పుడైనా తీరబోతోందా?

Pooja Hegde: అంతకు మించే ఉంటుంది