Dulquer Salmaan : ‘లక్కీ భాస్కర్‌’ షురూ!

ABN , First Publish Date - 2023-09-24T16:41:55+05:30 IST

‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఆయన హీరోగా ‘లక్కీ భాస్కర్‌’ చిత్రం రూపొందనుంది.

Dulquer Salmaan : ‘లక్కీ భాస్కర్‌’ షురూ!

‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఆయన హీరోగా ‘లక్కీ భాస్కర్‌’ చిత్రం రూపొందనుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. మీనాక్షి చౌదరి కథానాయిక. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఓ సాధారణ వ్యక్తి జీవితంలో ఎదురైన సమస్యలను అధిగమించి అసాధారణ వ్యక్తిగా ఎలా ఎదిగాడు అనే ఇత్తివృత్తంతో ఈ చిత్రం రూపొందుతుందని దర్శకుడు తెలిపారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు.

Untitled-1.jpg

Updated Date - 2023-09-24T16:56:00+05:30 IST