Shalini Pandey: బికినీలో.. అర్జున్ రెడ్డి పాప అరాచ‌కం

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:51 PM

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన శాలినీ పాండే ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది.

Shalini Pandey

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరోయిన్‌గా పరిచయమైన శాలినీ పాండే (Shalini Pandey) ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది.

ఆపై తెలుగులో118 వంటి ఒక‌టి రెండు చిత్రాల్లో మాత్ర‌మే న‌టించిన ఈ ముద్దుగుమ్మ అటుపై త‌మిళంలోనూ రెండు మూడు సినిమాలు చేసి చివ‌ర‌కు బాలీవుడ్‌లో సెటిల్ అయింది. అక్క‌డ అడ‌పా ద‌డ‌పా సినిమాలు , వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంటోంది.

Shalini Pandey

ఇక సోషల్ మీడియాలో అయితే శాలినీ (Shalini Pandey) ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తన ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు స్టైలిష్, గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ మైమరపిస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన బీచ్ లుక్ ఫోటోలు మాత్రం నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. తాజాగా ఇటీలీ విహారానికి వెళ్లిన ఆ అమ్మ‌డు అక్క‌డ రిసార్ట్స్‌, బీచ్‌ల‌లో సేద తీరుతూ స‌మ‌యం వెళ్ల‌దీస్తుంది.

Shalini Pandey

ఈ క్ర‌మంలోనే పచ్చని బికినీ ధరించి, సముద్ర తీరాన సూర్యకాంతిని ఆస్వాదిస్తూ, దిగిన ఫొటోలు కుర్రకారుకి మంచి కిక్ ఇచ్చాయి. దీంతో ఈ ఫోటోలు చూసిన అభిమానులు “వావ్, సమ్మర్ వైబ్స్ సూపర్‌గా చూపించావు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ ఫోటోలు, యాక్టింగ్ స్కిల్స్ రెండింటితోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న శాలినీ పాండే, హిందీలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో కనిపించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Shalini Pandey

Updated Date - Aug 21 , 2025 | 04:55 PM