సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pawan Kalyan: సూర్యోదయానికంటే ముందే...

ABN, Publish Date - Sep 25 , 2025 | 05:32 PM

ఓజీ ముంబై ఎంటర్ అయ్యే సన్నివేశాల చిత్రీకరణ గురించి సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ తెలిపారు. పవన్ కళ్యాణ్‌ ఆ సన్నివేశాల చిత్రీకరణకు ఎంతో సహకరించారని అన్నారు.

Pawan Kalyan OG movie

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) సినిమా 'ఓజీ' (OG) లోని ప్రతి షాట్ గురించి ఇవాళ అభిమానులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. దర్శకుడు సుజీత్ (Sujeeth) టేకింగ్ తో పాటు తమన్ (Thaman) ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీని మరో స్థాయికి తీసుకెళ్ళిందని అంటున్నారు. దానితో పాటు ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన మనోజ్ పరమహంసతో పాటు రవి కె. చంద్రన్ (Ravi K Chandran) ను ప్రత్యేకంగా తలుచుకుంటున్నారు. అలానే నవీన్ నూలి (Naveen Nooli) ఎడిటింగ్ ఆసమ్ అంటున్నారు. ప్రతి డైలాగ్ తర్వాత దానికి సంబంధించిన బ్యాక్ స్టోరీని తెలిపే షాట్ వేయడంతో ఆ ఫీల్ అలా సూటిగా మనసుల్ని తాకిందని అంటున్నారు. అయితే... వీరందరూ ఇంత అద్భుతంగా పని చేయడానికి సహకారం అందించింది, ప్రేరణగా నిలిచింది మాత్రం పవన్ స్టార్ పవన్ కళ్యాణే. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.


ఓజీ ముంబై ఎంట్రీ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటి. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర మొదలయ్యే ఈ సీన్ ఓజీ విశ్వరూపాన్ని చూపుతుంది. అక్కడ మొదలు పెట్టి అరి వర్గాలను నాన్ స్టాప్ గా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు ఓజీ. ఈ సన్నివేశం చిత్రీకరణ గురించి సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ వివరిస్తూ, 'గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర సూర్యోదయంలో ఓ షాట్ తీయాలని అనుకున్నాం. అందుకోసం తెల్లవారు ఝామున ఐదు గంటలకు పవన్ కళ్యాణ్ గారిని షూటింగ్ స్పాట్ రమ్మని చెప్పాం. కానీ ఆయన అంతకంటే ముందే అక్కడికి చేరుకున్నారు. సూర్యోదయం వరకూ ఓపికగా వేచి ఉన్నారు. ఇవాళ ఆ షాట్ ను ప్రేక్షకులు ఎంత బాగా మెచ్చుకుంటున్నారో! షూటింగ్ టైమ్ లో పవన్ కళ్యాణ్‌ కు అది బాగా నచ్చింది' అని అన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు సమష్ఠి కృషి కారణంగానే 'ఓజీ' ఈ స్థాయిలో ఓపెనింగ్స్ ను సాధించిందన్నది వాస్తవం.

Also Read: Top Directors: వరుసగా వంద కోట్ల డైరెక్టర్స్...

Also Read: Puri jaganath: ఆ అభిమాని ఎవరో కాదు.. పూరి జగన్నాథ్‌..

Updated Date - Sep 25 , 2025 | 05:32 PM