Top Directors: వరుసగా వంద కోట్ల డైరెక్టర్స్...
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:15 PM
ఓ సినిమా వంద కోట్లు పోగేసిందంటేనే ఓ విశేషం! అలాంటిది ఓపెనింగ్స్ లోనే హండ్రెడ్ క్రోర్ చూడడం మరింత స్పెషల్!. అలా వరుసగా రెండు సినిమాలతో ఓపెనింగ్స్ లోనే నూరు కోట్లు కొల్లగొట్టేశారు కొందరు డైరెక్టర్స్. వారెవరో చూద్దాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ (Sujeeth) డైరెక్షన్ లో రూపొందిన 'ఓజీ' (OG) సినిమా మొదటి రోజునే వంద కోట్లు ఓపెనింగ్ చూస్తోందని సమాచారం. దాంతో వరుసగా రెండు సినిమాలతో నూరు కోట్ల రూపాయల ఓపెనింగ్ చూసిన నాలుగో డైరెక్టర్ గా సుజీత్ నిలచి పోయారు. ఇంతకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ రూపొందించిన 'సాహో' (Sahoo) సినిమా కూడా మొదటి రోజున హండ్రెడ్ క్రోర్స్ కు పైనే పోగేసింది. అసలు ఈ ఫీట్ ను సాధించిన మొదటి డైరెక్టర్ మన దర్శకధీర రాజమౌళి (Rajamouli) అనే చెప్పాలి. రాజమౌళి రూపొందించిన 'బాహుబలి-2 (Bahaubali -2), ట్రిపుల్ ఆర్ (RRR)' రెండు చిత్రాలు మొదటి రోజునే వంద కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ చూశాయి.
వరుసగా రెండు చిత్రాలతో వంద కోట్ల ఓపెనింగ్స్ చూసిన డైరెక్టర్స్ లో ప్రశాంత్ నీల్, తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కూడా ఉన్నారు. ప్రశాంత్ నీల్ తన 'కేజీఎఫ్-2'తోనూ, తరువాత ప్రభాస్ 'సలార్'తోనూ వరుసగా వంద కోట్ల ఓపెనింగ్ చూశారు. అలాగే లోకేశ్ కనగరాజ్ 'లియో, కూలీ' మూవీస్ తో ఈ తీరున మురిపించారు. ఈ నలుగురు దర్శకుల్లో ముగ్గురు తెలుగువారే ఉండడం విశేషం కాగా, ప్రశాంత్ నీల్ ఈ ఫీట్ ను ఓ కన్నడ, ఓ తెలుగు సినిమాతో సాధ్యం చేసుకున్నారు. కాగా, ఈ ఫీట్ ను సాధించడంలో రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుజీత్ ముగ్గురికీ తోడ్పడిన ఏకైక హీరోగా ప్రభాస్ నిలవడం విశేషం! మునుముందు ఏ డైరెక్టర్స్ ఈ ఫీట్ ను సాధిస్తారో చూడాలి.
Also Read: Puri jaganath: ఆ అభిమాని ఎవరో కాదు.. పూరి జగన్నాథ్..
Also Read: Pawan - Prabhas: 'ఓజీ -2'లో వాళ్ళిద్దరూ....