OG Movie: ఓజీ నుంచి గీత వచ్చేసింది..
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:21 PM
ఇంకో వారం రోజుల్లో ఓజీ (OG) సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. అసలు ఒక సినిమాకు ఇంత హైప్ ఉంటుందని ఇండస్ట్రీ మొత్తానికి ఇప్పుడే అర్ధమయ్యిందని చెప్పొచ్చు.
OG Movie: ఇంకో వారం రోజుల్లో ఓజీ (OG) సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. అసలు ఒక సినిమాకు ఇంత హైప్ ఉంటుందని ఇండస్ట్రీ మొత్తానికి ఇప్పుడే అర్ధమయ్యిందని చెప్పొచ్చు. అసలు ఒక ఇంటర్వ్యూ కానీ, ఒక ప్రెస్ మీట్ కానీ లేకుండా సినిమాపై భారీ అంచనాలను పెట్టుకొనేలా చేస్తున్నారు. కేవలం సినిమాలోని కంటెంట్ తోనే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. నిన్నటికి నిన్న వాషీ యో వాషీ శొంగ్ ను రిలీజ్ చేసి ట్రెండ్ సృష్టించిన మేకర్స్.. తాజాగా సినిమా నుంచి శ్రీయా రెడ్డి పోస్టర్ ను రిలీజ్ చేశారు.
అప్పుడప్పుడు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన శ్రీయా రెడ్డి.. పొగరు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే విశాల్ అన్న విక్రమ్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని గృహిణిగా సెటిల్ అయ్యింది. ఇక చాలా గ్యాప్ తరువాత ఈ మధ్యనే శ్రీయా రీఎంట్రీ ఇచ్చింది. సలార్ లో రాధా రమా మన్నార్ గా ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ సినిమా తరువాత సిరియాకు ఓజీలో ఛాన్స్ వచ్చింది.
ఓజీ సినిమా మొదలైనప్పటి నుంచి శ్రీయా ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. పవన్ యాక్టింగ్ సూపర్ అని, ఆయన సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా చాలా పవర్ ఫుల్ మనిషి అని చెప్పుకొచ్చింది. ఇక దీంతో ఓజీపై మరింత హైప్ వచ్చింది. ఇక ఇన్నాళ్లకు ఓజీ నుంచి శ్రీయా పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో గీత అనే పాత్రలో ఆమె నటిస్తున్నట్లు తెలిపారు. గన్ పట్టుకొని.. చురకత్తులు లాంటి చూపుతో శ్రీయా కనిపించింది. లుక్ ను బట్టి ఇందులో కూడా శ్రీయా నెగిటివ్ రోల్ లోనే నటిస్తుందని తెలుస్తోంది. ఆమె చూపులే అన్ని చెప్తున్నాయి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Siddhu Jonnalagadda: ‘ఓజీ’ హైప్.. టిల్లు ఏమన్నాడంటే..
Geetha bhagat: ట్రెండింగ్‌లో ఆర్.పి.పట్నాయక్ ‘తను రాధా.. నేను మధు’..