సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OG Songs: త‌మ‌న్ రేర్ రికార్డ్.. 2025 టాప్‌లో ఓజీ సాంగ్స్‌

ABN, Publish Date - Oct 07 , 2025 | 12:08 PM

పవన్ కళ్యాణ్‌ ఓజీ సినిమాలోని పాటలు మ్యూజిక్ చాట్ బస్టర్స్ జాబితలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఈ రికార్డ్ స్థాయి రెస్పాన్స్ కు తమన్ ప్రధాన కారణమని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ చెబుతోంది.

OG movie - Thaman Music

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'ఓజీ' (OG) మూవీ 11 రోజుల్లో 308 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ (DVV Entertainment) ప్రకటించింది. ఈ యేడాది తెలుగులో అత్యధిక గ్రాస్ ను వసూలు చేసిన చిత్రం తమదేనని పేర్కొంది. సిల్వర్ స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ ను చూసిన అభిమానులకు చాలా సన్నివేశాలలో పూనకాలు వచ్చేశాయి. దానికి ప్రధాన కారణం ఫ్యాన్ బోయ్ అయిన దర్శకుడ సుజీత్ (Sujith) కాగా, నేపథ్య సంగీతంతో ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman).


గతంలో పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్ (Vakeel Saab), భీమ్లా నాయక్ (Bheemla Naiak), బ్రో (Bro)' చిత్రాలకు తమన్ అందించిన సంగీతం ఒక ఎత్తు అయితే... 'ఓజీ'కి తమన్ ఇచ్చిన మ్యూజిక్ మరో ఎత్తు. ఇవాళ మ్యూజిక్ ఛార్ట్ బస్టర్స్ తో 'ఓజీ' అగ్రస్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ సైతం తెలిపింది. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకూ వచ్చిన టాప్ టెన్ తెలుగు సాంగ్స్ లో ఏకంగా ఐదు పాటలు 'ఓజీ'వే ఉన్నాయని తెలిపింది.

ఇందులో అగ్రస్థానంలో 'ఓజీ' మూవీలోని ఫైర్ స్ట్రోమ్ సాంగ్ నిలువగా, రెండో స్థానంలో అదే సినిమాలోని 'గన్స్ అండ్ రోజెస్' సాంగ్ ఉంది. ఇక మూడో సాంగ్ 'మిరాయ్' (Mirai) సినిమాలోని 'వైబ్ ఉంది...' ఉండగా, నాలుగో పాటగా రజనీకాంత్ (Rajinikanth) 'కూలీ' (Coolie) లోని 'మోనికా' సంగ్ నిలిచింది. ఆ తర్వాత 'షహీబా' నిలువగా, 6,7,8 స్థానాల్లో ఓజీ లోని మూడు పాటలు వరుసగా నిలిచాయి. ట్రాన్స్ ఆఫ్ ఓమీ, హంగ్రీ చీతా, సువ్వీ సువ్వీ పాటలు ఈ స్థానాలను దక్కించుకున్నాయి. ఆ తర్వాత 'జూనియర్'లోని వైరల్ వయ్యారి పాట నిలిచింది. పదో స్థానంలో 'నేను నువ్వంటూ' సాంగ్ ఉంది. మొత్తంగా పది పాటల్లో ఐదు పాటలు 'ఓజీ'వే కావడం ఆనందంగా ఉందని, ఓ సినిమా పాటలన్నీ ఇలా చార్ట్ బస్టర్ లో చోటు చేసుకోవడం చాలా రేర్ అని, అది తమన్ కే సాధ్యమైందని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ తెలిపింది.


Also Read: Mahesh babu: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు కొత్త కళ.. త్వ‌ర‌లో మహేశ్ బాబు మల్టీప్లెక్స్ ప్రారంభం

Also Read: Samantha: వెట్రిమార‌న్ యూనివ‌ర్స్.. శింబు స‌ర‌స‌న‌ స‌మంత‌

Updated Date - Oct 07 , 2025 | 12:16 PM