OG Team: డల్లాస్‌లో 'ఓజీ' టీమ్‌.. సీక్వెల్‌లో ఉంటాడా..

ABN , Publish Date - Oct 05 , 2025 | 05:26 PM

'ఓజీ' సినిమా తీయడం, పది రోజులో నెల రోజులో ఆడటం, గుర్తు పెట్టుకోవడం ఇది కాదు నేను కోరుకున్నది. ఇదొక యుఫోరియాలా ఉండాలనుకున్నా.

OG Team in Dallas

'ఓజీ' (OG) సినిమా తీయడం, పది రోజులో నెల రోజులో ఆడటం, గుర్తు పెట్టుకోవడం ఇది కాదు నేను కోరుకున్నది. ఇదొక యుఫోరియాలా (OG EUPHORIA) ఉండాలనుకున్నా. అలాగే సినిమా తీశా. ప్రేక్షకులు చక్కని ఫలితం ఇచ్చారు. అందుకు చాలా ఆనందంగా ఉంది’ అని సుజీత్‌ (sujeeth) అన్నారు.  పవన్‌ కల్యాణ్‌ హీరోగా ఆయన తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ‘ఓజీ’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఇంతెలుగు రాష్ట్రాలోనే కాకుండా విదేశాల్లోనూ సినిమాకు రెస్పాన్స్‌ అదిరిపోయింది. ఆనందోత్సాహంలో ఉన్న దర్శకుడు సుజీత్‌, సంగీత దర్శకుడు తమన్‌ డల్లాస్‌ వెళ్లారు. అక్కడి ఓ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. షో పూర్తయ్యాక కేక్‌ కట్‌ చేసి, సెలబ్రేట్‌ చేసుకున్నారు. (OG Team in Dallas)

11.jpgఅనంతరం అభిమానులతో ఇంటరాక్ట్‌ అయ్యారు. ‘ఓజీ’కి సీక్వెల్‌ వస్తుందా? ప్రీక్వెల్‌ రానుందా? అని అడగ్గా.. రెండూ వస్తాయని తెలిపారు. ‘ఓజీ’ ప్రీక్వెల్‌లో అకీరా నందన్‌ ఉంటారా? అని మరొకరు ప్రశ్నించగా.. దాని గురించి ఇప్పుడే చెబితే థ్రిల్‌ ఉండదని ఆయన అన్నారు.    ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌ మీట్‌లో ‘ఓజీ’ ప్రీక్వెల్‌, సీక్వెల్‌ ఉంటాయని పవన్‌ కల్యాణ్‌  చెప్పారు. అయితే కొన్ని షరతులు కూడా ఉంటాయని ఆయన అన్నారు. ప్రస్తుతం సుజీత్‌ నాని హీరోగా ఓ సినిమా ప్రారంభించారు. ఈ సినిమా పూర్తయ్యాక  ‘ఓజీ’ ప్రీక్వెల్‌గానీ సీక్వెల్‌గానీ మొదలయ్యే అవకాశాలు అని తెలుస్తోంది. నానితో సుజీత్‌ తెరకెక్కించే సినిమా ‘ఓజీ’ యూనివర్స్‌లో భాగమని వైరల్‌ అవుతున్న వార్తలను దర్శకుడు ఖండించారు. ‘రన్‌ రాజా రన్‌’ స్టైల్‌లో ఆ సినిమా ఉంటుందని అన్నారు. అయితే  డల్లాస్  జరిగిన  షోలో సుజీత్ 11వ నెంబర్ సీట్లో కూర్చోవడంతో ఆ పిక్ నెట్టింట  వైరల్ అవుతోంది. 

Updated Date - Oct 05 , 2025 | 06:39 PM