సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Actor Nandu: నాపై తప్పుడు ప్రచారం

ABN, Publish Date - Dec 29 , 2025 | 05:06 PM

నందు హీరోగా నటించిన 'సైక్ సిద్ధార్ధ', విలన్ గా నటించిన 'వనవీర' ఒకే రోజు రాబోతున్నాయి. అయితే 'వన వీర' ప్రమోషన్స్ ను తాను పట్టించుకోవడం లేదన్న విమర్శలో నిజం లేదని నందు అంటున్నాడు.

Actor Nandu

మొన్నటి వరకూ టీవీ షోస్ కు పరిమితమైపోయిన నటుడు నందు (Nandu) కు ఒక్కసారిగా మంచి రోజులు వచ్చినట్టైంది. అతను కీలక పాత్ర పోషించిన 'దండోరా' (Dhandoraa) మూవీ డిసెంబర్ 25న విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అంతేకాదు... అతను హీరోగా నటించిన 'సైక్ సిద్ధార్థ' (Psych Siddharth), విలన్ గా నటించిన 'వానర' (Vanara) చిత్రాలు కూడా ఇదే డిసెంబర్ లో విడుదల కావాల్సి ఉంది. అయితే 'అఖండ 2' (Akhanda 2) సినిమా కారణంగా 'సైక్ సిద్ధార్థ' జనవరి 1కి వాయిదా పడింది. అలానే డిసెంబర్ 26న రావాల్సిన 'వానర' కూడా ఆ రోజున విడుదల కాలేదు. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ సినిమా పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇప్పుడు 'వనవీర' (Vanaveera) గా మార్చి... జనవరి 1న విడుదల చేయబోతున్నారు. మొన్న ఈ విషయాన్ని తెలియచేస్తూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చిత్ర దర్శకుడు, హీరో అవినాశ్‌ తమ చిత్రం ప్రమోషన్స్ ను తోటి నటీనటులు పట్టించుకోవడం లేదని, ఎలాంటి సహకారం అందించడం లేదని వాపోయాడు. పరోక్షంగా అవినాశ్‌ 'వనవీర'లో విలన్ గా నటించిన నందును ఉద్దేశించే ఈ విమర్శ చేశాడని చాలా మంది భావించారు. దానిపై నటుడు నందు స్పందించాడు.


సోమవారం 'సైక్ సిద్దార్థ' ప్రెస్ మీట్ లో నందు మాట్లాడుతూ, 'ఈ మధ్య కాలంలో నా అంత అదృష్టవంతుడు ఎవరూ లేరనే భావన కలుగుతోంది. నేను నటించిన 'దండోరా' మంచి విజయాన్ని అందుకుంది. జనవరి 1న హీరోగా నటించిన 'సైక్ సిద్ధార్థ', విలన్ గా నటించిన 'వనవీర' రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధిస్తే... ఓ రేర్ ఫీట్ ను అఛీవ్ చేసిన నటుడిగా నేనో ఎగ్జాంపుల్ గా నిలిచిపోతాను. అయితే 'వనవీర' సినిమాకు నేను ప్రచారం చేయడం లేదనే విమర్శలో నిజం లేదు. నాకు ట్రైలర్ లాంచ్ విషయాన్ని ముందు రోజు సాయంత్రం చెప్పారు. అప్పటికే నేను 'సైక్ సిద్ధార్థ' ప్రమోషనల్ టూర్ లో ఉన్నాను. అప్పటి వరకూ నా పోస్టర్ కూడా వేయని 'వనవీర' మేకర్స్... నటీనటులు సహకరించడం లేదని చెప్పిన ప్రెస్ మీట్ లో నా పోస్టర్ వేశారు. సంతోషం. నిజానికి వాళ్ళు నా పేరును ప్రత్యేకంగా చెబుతూ ఎలాంటి విమర్శ చేయలేదు. అయినా వారి బాధను నేను అర్థం చేసుకోగలను. వాళ్ళలానే నేనూ నా సినిమా ప్రమోషన్స్ కోసం హీరోయిన్ ను వెంట పెట్టుకుని ఊళ్ళు తిరుగుతున్నాను. నాకు 'వనవీర' దర్శక నిర్మాతలంటే ఎలాంటి కోపం లేదు. అది కూడా నా సినిమానే. నేను అందులో మెయిన్ విలన్ గా చేశాను. వాళ్ళు ఎంతో కష్టపడి ఆ సినిమా తీశారు. నేను హీరోగా నటించిన సినిమాతో పాటు విలన్ గా నటించిన సినిమా కూడా సక్సెస్ అయితే నాకంటే సంతోషించే వ్యక్తి ఇంకెవరుంటారు?' అని అన్నారు.

'సైక్ సిద్ధార్ధ' ప్రమోషన్స్ కోసం 102 డిగ్రీల జ్వరంతో తిరుగుతున్నానని నందు చెప్పాడు. వారం రోజుల్లో మూడు సినిమాలు విడుదల కావడం అనేది చాలా రేర్ గా జరుగుతుందని, అది తనకు లభించిన గొప్ప అవకాశమని నందు తెలిపాడు. సురేశ్‌ బాబు విడుదల చేస్తున్న 'సైక్ సిద్ధార్థ' మూవీకి నందు కూడా నిర్మాణ భాగస్వామి.

Also Read: The RajaSaab Trailer 2.0: ఇది కదా కావాల్సింది.. ట్రైలర్ అదిరిపోయింది రాజాసాబ్

Also Read: Peddi: పెద్దిలో అప్పలసూరిగా స్టార్ నటుడు.. గుర్తుపట్టారా ఎవరో

Updated Date - Dec 29 , 2025 | 05:13 PM