Vanara Movie: కొత్త సంవత్సరం తొలి రోజున... వానర

ABN , Publish Date - Dec 20 , 2025 | 09:48 AM

అవినాశ్‌ తిరువీధుల హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా 'వానర'. డిసెంబర్ 26న విడుదల కావాల్సిన ఈ సినిమాను జనవరి 1కి వాయిదా వేశారు.

Vanara Movie

అవినాశ్‌ తిరువీధుల హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'వానర' (Vanara). సిమ్రాన్ చౌదరి (Simran Choudhary) హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో నందు (Nandu) విలన్ గా నటించాడు. డిసెంబర్ 26న రావాల్సిన ఈ సినిమాను ఇప్పుడు జనవరి 1'కి వాయిదా వేశారు. విశేషం ఏమంటే... నందు హీరోగా నటించిన 'సైక్ సిద్ధార్థ్‌' మూవీ కూడా జనవరి 1నే వస్తోంది. 'వానర' సినిమా ప్రమోషన్స్ ను అవినాశ్‌ మొదటి నుండి భిన్నంగా చేస్తున్నాడు. తాజాగా సినిమా వాయిదా పడిన విషయాన్ని కూడా అంతే క్రియేటివిటీతో ఓ గ్లింప్స్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఈ మధ్య కాలంలో ఇంత వైవిధ్యంతో కూడిన ప్రచారం మరో చిత్ర బృందం చేయలేదన్నది నిజం. అవినాశ్‌ బుయానీ, ఆలపాటి రాజా, సి. అంకిత్ రెడ్డి నిర్మిస్తున్న 'వానర' చిత్రానికి సాయి మాధవ్ బుర్రా (Sai Madhav Burra) సంభాషణలు రాయగా, వివేక్ సాగర్ (Vivek Sagar) సంగీతం అందించారు. మైథలాజికల్ రూరల్ డ్రామా కథతో తెరకెక్కిన 'వానర' ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని మేకర్స చెబుతున్నారు. ఇందులో 'ఖడ్గం' పృథ్వీ, కోన వెంకట్ (Kona Venkat), సత్య, ఆమని (Aamani), శివాజీ రాజా, ఛమ్మక్ చంద్ర, రచ్చ రవి తదితరులు ఇతర ప్రధాన పాత్రలను పోషించారు.

Updated Date - Dec 20 , 2025 | 10:07 AM