Ponnambalam: ల‌క్ష ఇస్తార‌నుకుంటే.. చిరంజీవి కోటి ఇచ్చారు

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:31 PM

అడగ్గానే ఒకటో, రెండో లక్షలు చిరంజీవి సాయం చేస్తారని అనుకున్నా కానీ ఆయ‌న చేసిన సాయం మాత్రం అంతకు మించింది అంటూ పొన్నాంబ‌లం అన్నారు.

Chiranjeevi

నా కష్టం పగవాడికి కూడా రాకూడదు త‌మిళ సినీ నటుడు పొన్నాంబళం (Ponnambalam) ఇటీవ‌ల ఓ ఛాన‌ల్‌లో మాట్లాడుతూ త‌న ఆవేద‌న వెలిబుచ్చ‌డంతో పాటు, చిరంజీవి (Chiranjeevi) చేసిన సాయాన్ని గురించి చెప్పిన విష‌యం తెలిసిందే. రెండు కిడ్నీలు దెబ్బతిని మూడేండ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన ఇటీవ‌ల ఓ ఛాన‌ల్‌తో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. డయాలసిస్ జరిగే సమయంలో రెండు సార్లు సూదులతో రక్తం తీసి, ఆ తర్వాత డయాలసిస్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు దాదాపు 750 మార్లు సూదులు వేయించుకున్నా గత నాలుగేళ్ళుగా ఈ తంతు జరుగుతోంది. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు అన్నారు.

అయితే.. కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకునేందుకు ఎంతగానో కష్టపడ్డాను. నాకు పునర్జన్మనిచ్చింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ఆయనే నాకు భారీగా సాయం చేశారు. నాకు కిడ్నీ సమస్య వచ్చిన స‌మ‌యంలో . ఎవరైనా హెల్ప్‌ చేస్తారని చూస్తున్నా అప్పుడే చిరంజీవి గుర్తుకు రావడంతో.. నా మిత్రుడి వ‌ద్ద నంబ‌ర్‌ తీసుకుని అన్నయ్యకు నా అనారోగ్యం గురించి మెసేజ్ పెట్టాను. అది చూసిన‌ వెంటనే అన్నయ్య ఫోన్‌ చేశారు. హైదరాబాద్‌ వస్తారా అని అడిగారు. కష్టమని చెప్పడంతో వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్ వస్తుంది. అక్కడికి వెళ్లి అడ్మిట్ అవ్వమని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే అక్కడి వెళ్లగా, ఎంట్రీ ఫీజు కూడా లేకుండా నన్ను అడ్మిట్ చేసుకున్నారు. ట్రీట్‌మేంట్ అయినా మొత్తం ఖర్చు రూ.40 లక్షలను ఆయనే భరించారు.

నిజానికి అడగ్గానే ఒకటో, రెండో లక్షలు చిరంజీవి సాయం చేస్తారని అనుకున్నా కానీ కానీ ఆయ‌న చేసిన సాయం మాత్రం అంతకు మించింది. వైద్యానికి అవసరమయ్యే రూ.40 లక్షలు ఆయనే ఇస్తారని అనుకోలేదని ఇప్ప‌టి వ‌ర‌కు కోటి రూపాయ‌ల వ‌ర‌కు సాయం చేశారంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న ఆయన, చిరంజీవి ఉదారత గురించి ఎప్పుడైనా మాట్లాడే అవకాశం వస్తే తప్పక ప్రస్తావిస్తారు. సినిమా పరిశ్రమలో ఎవరికైనా నిజమైన గౌరవం ఉంటే, వారికి సహాయం చేయడంలో చిరంజీవి వెనకడుగు వేయరని పొన్నంబలం తెలిపారు. ఇదిలాఉంటే.. (Ponnambalam) చిరంజీవి ‘ఘరానా మొగుడు’ చిత్రంతో విలన్‌గా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. అనంతరం ఎన్నో చిత్రాల్లో విలన్‌గా నటించి అలరించాడు.


Also.. Read ఇవి కూడా చ‌వ‌దండి..

Gamblers OTT: ఆ ఓటీటీకి వ‌చ్చేసిన.. మ్యాడ్ హీరో లేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

Coolie Twitter Review: ర‌జ‌నీ కూలీ ఎలా ఉందంటే.. ట్విట్ట‌ర్ రివ్యూ

War 2 Twitter X Review: హృతిక్ రోష‌న్, జూ.ఎన్టీఆర్.. వార్ 2 ఎలా ఉందంటే! ట్విట్ట‌ర్ X రివ్యూ

Coolie: ‘కూలీ’.. రజినీకాంత్ స్టాండ‌లోన్ చిత్రం! లోకేశ్ ఎమోష‌న‌ల్ పోస్ట్

Sadha: ఇండియాలో.. ఇలాంటి తీర్పా! భోరున విల‌పించిన స‌దా

Virgin Boys OTT: ఆ ఓటీటీకి వ‌స్తోన్న‌.. మిత్రా శర్మ కుర్రాళ్ల సినిమా! అన్నీ ముద్దులు, ద్వందార్థాలే

Updated Date - Aug 14 , 2025 | 01:39 PM