Manchu Family: అప్పుడు అక్క... ఇప్పుడు తమ్ముడు...

ABN , Publish Date - Sep 08 , 2025 | 05:07 PM

పద్నాలుగేళ్ళ క్రితం మంచు లక్ష్మీ 'అనగనగా ఓ ధీరుడు' సినిమాలో ప్రతి నాయకురాలిగా నటించింది. అందులో ఆమెది మంత్రగత్తె పాత్ర. ఇప్పుడు ఆమె తమ్ముడు మనోజ్ సైతం 'మిరాయ్'లో అలాంటి మంత్రగాడు, బ్లాక్ మ్యాజిక్ చేసే పాత్రనే పోషించాడు.

Manchu Lakshmi - Manoj

మంచు మోహన్ బాబు (Manchu Manoj) కుమార్తె లక్ష్మీ (Lakshmi) తెలుగు తెరకు పరిచయం అయిన సినిమా ఏదో గుర్తొందా!? దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) తనయుడు కోవెలమూడి ప్రకాశరావు (Kovelamudi Prakasarao) దర్శకుడిగా పరిచయమై 'అనగనగా ఓ ధీరుడు' మూవీలో శ్రుతీహాసన్ (Shruthi Haasan) హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాగా, విలన్ గా మంచు లక్ష్మీ నటించింది. ఈ సినిమా 2011లో వచ్చింది. ఇందులో మంత్రగత్తె ఐరేంద్రిగా ఆమె నటించింది. అత్యుత్తమ నటన కనబర్చినందుకు ఉత్తమ ప్రతినాయకురాలిగా నంది అవార్డును గెలుచుకుంది.


విశేషం ఏమంటే పద్నాలుగేళ్ళ తర్వాత ఆమె చిన్న తమ్ముడు మంచు మనోజ్ దాదాపు అలాంటి మంత్రగాడి పాత్రనే 'మిరాయ్' (Mirai) సినిమాలో పోషించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రోమో చూస్తే... మనోజ్ పాత్ర పవర్ ఫుల్ పాత్రను పోషించాడో అర్థమౌతోంది. కాలాతీతుడైన లామా పాత్రను మంచు మనోజ్ 'మిరాయ్'లో పోషించాడట. అమరత్వాన్ని పొందడం కోసం అతను ఎలాంటి తాంత్రిక విద్యలను ప్రదర్శిస్తాడో ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చునని అంటున్నారు. కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ (TG Viswaprasad) నిర్మించిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. ఇది సెప్టెంబర్ 12న జనం ముందుకు రాబోతోంది.


'దొంగ దొంగది' సినిమాతో హీరోగా మనోజ్ ఎంట్రీ ఇచ్చినా... ఆశించిన స్థాయిలో అతనికి హీరోగా సక్సెస్ లు దక్కలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సినిమాలు చేస్తున్నాడు. మొన్న వచ్చిన 'భైరవం'లోనూ ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు మనోజ్. ఇప్పుడు అక్క బాటలో సాగుతూ... ఆమె పుష్కరం క్రితం పోషించిన పాత్రనే మనోజ్ చేశాడు. మరి 'మిరాయ్'లోని విలన్ పాత్ర కూడా మంచు లక్ష్మీకి తెచ్చిపెట్టినట్టుగా మనోజ్ కు ప్రభుత్వ అవార్డులను తెచ్చిపెడతాయేమో చూడాలి. ఎందుకంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 'గద్దర్ సినీ అవార్డు'లను ప్రవేశ పెట్టింది. ఈ యేడాది నుండి ఏపీ ప్రభుత్వం సైతం నంది అవార్డులు ఇస్తుందనే మాట వినిపిస్తోంది.

Also Read: OTT Films: ఈ వారం.. ఓటీటీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లివే! ద‌బిడి.. దిబిడే

Also Read: Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లో శృంగార తారల హంగామా...

Updated Date - Sep 08 , 2025 | 05:07 PM

Mirai Making: సూపర్‌ యోధగా తేజ.. చుక్కలు చూపిస్తున్నారుగా..  

Mirai Song: వైబ్‌ ఉంది బేబీ.. వైబ్‌ ఉందిలే ..

Mirai Teaser: తేజ సజ్జా.. సూపర్‌ యోధ మిరాయ్ టీజ‌ర్ వ‌చ్చేసింది

Mirai Trailer: త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం

Manchu Lakshmi: వ్యకిత్వానికి ప్రతిరూపం సమంత.. ఆమె దేశమంతటికి స్ఫూర్తి..