Mirai Teaser: తేజ సజ్జా.. సూపర్ యోధ మిరాయ్ టీజర్ వచ్చేసింది
ABN , Publish Date - May 28 , 2025 | 10:30 AM
‘హనుమాన్’ చిత్రంలో సూపర్ హీరోగా కనిపించిన యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా వస్తోన్న మిరాయ్ సినిమా నుంచి బుధవారం టీజర్ విడుదల చేశారు.
‘హనుమాన్’ (HanuMan) చిత్రంలో సూపర్ హీరో (Super Hero)గా కనిపించిన యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా రవితేజ ఈగల్ ఫేం కార్తిక్ ఘట్టమనేని (Karthik Gattamneni) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’ (Mirai,). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన తేజ సజ్జా, మంచు మనోజ్ ఫస్ట్‌లుక్ పోస్టర్లు, స్పెషల్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఓ కీలక అప్డేట్ ఇచ్చారు.
మేకర్స్ ముందు చెప్పినట్టు గానే బుధవారం ఉదయం 10గంటల 8 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేశారు.ఈ టీజర్ చూసిన వారంతా మైండ్ బ్లోయింగ్‌గా ఉంది, హాలీవుడ్ రేంజ్‌లో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తేజకు మరో భారీ విజయం ఖాయమని అంటున్నారు.
ఈ చిత్రంలో తేజ సజ్జా సూపర్ యోధగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా, మంచు మనోజ్ (Manchu Manoj) ప్రతి నాయకుడిగా, రీతికా నాయక్ (Ritika Nayak) కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.