సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Little Hearts: ప్లెజెంట్ గా ఉండే 'లిటిల్ హార్ట్స్'

ABN, Publish Date - Aug 29 , 2025 | 04:49 PM

'90s మిడిల్ క్లాస్ బయోపిక్' ఫేమ్ మౌళి తనుజ్(Mouli thanuj), శివానీ నాగరం (Shivani Nagaram) జంటగా నటిస్తున్న సినిమా 'లిటిల్ హార్ట్స్'

'90s మిడిల్ క్లాస్ బయోపిక్' ఫేమ్ మౌళి తనుజ్(Mouli thanuj), శివానీ నాగరం (Shivani Nagaram) జంటగా నటిస్తున్న సినిమా 'లిటిల్ హార్ట్స్' (little Hearts) . ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఈ సందర్భంగా మూవీ హైలైట్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు నిర్మాతలు ఆదిత్య హాసన్, సాయి కృష్ణ.

నిర్మాత ఆదిత్య హాసన్ మాట్లాడుతూ, 'ఈ సినిమా కథ విన్నప్పుడు ఇది నా శైలి రచనతో ఉన్న కథ అనిపించింది. మనమంతా బాగా రిలేట్ అయ్యే కథ ఇది. ప్రేక్షకులు రెండు రకాల కథల్లో లీనమవుతారు. ఒకటి తాము చేయాలనుకున్నవి చూపించే కథలు, రెండు తాము చేసినవి చూపించే స్టోరీస్. ఇది రెండో తరహా మూవీ. ప్రేక్షకులు తమ లైఫ్ లో కూడా ఇలా జరిగిందే అని సినిమా చూస్తున్నంత సేపు రిలేట్ అవుతారు. కథ విన్నప్పుడు ఒక ప్రేక్షకుడిగా నేనూ ఎంజాయ్ చేశాను. బాగా రిలేట్ అయ్యాను. ఈ సినిమాకు రైటింగ్, ఆర్టిస్ట్ సెలెక్షన్, ఇతర అంతా సాయి మార్తాండ్ చూసుకున్నాడు. రైటింగ్ సైడ్ నా ఇన్వాల్వ్ మెంట్ ఏమీ లేదు. ప్రొడక్షన్ పరంగా నేను ఏ సపోర్ట్ చేయగలనో మాకున్న బడ్జెట్స్ లో చేశాను. నేను ప్రొడ్యూస్ చేస్తున్నాననే విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇందులో సీరియస్ లవ్ స్టోరీ ఏం లేదు. టీనేజ్ లో ఉండే ఇమ్మెచ్యూర్ లవ్ స్టోరీ చూపిస్తున్నాం. అది సరదాగా సాగుతుంది. ఈ ప్రేమకథలో పెద్ద ట్విస్ట్ లు ఏమీ ఉండవు. ఒకప్పుడు మనం ఇంత సిల్లీగా ఉన్నామా అనిపిస్తుంటుంది. ప్లెజెంట్ గా ఉంటుంది' అని అన్నారు.


మరో నిర్మాత సాయి కృష్ణ మాట్లాడుతూ, 'వెబ్ సిరీస్ లు ఇలాగే ఉండాలనే ట్రెండ్ ను 90s మిడిల్ క్లాస్ బయోపిక్ బ్రేక్ చేసింది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథ, మనం రిలేట్ అయ్యేలా చేస్తే ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో ఆ వెబ్ సిరీస్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కూడా అలాగే సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. ముందునుంచీ ఈ కథను థియేట్రికల్ మూవీ చేయాలనే ప్లాన్ చేశాం. మనకు కోవిడ్ తర్వాత చూస్తే. బాగున్న సినిమాలన్నీ థియేట్రికల్ గా బాగా ఆదరణ పొందాయి. ఈటీవీ విన్ నుంచి లిటిల్ హార్ట్స్ ప్రొడ్యూస్ చేయడం హ్యాపీగా ఫీలవుతున్నాం. కంటెంట్ ను బట్టి ఏది థియేటర్ కు బాగుంటుంది, ఏది ఓటీటీకి బాగుంటుంది అనేది సెలెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈటీవీ విన్ నుంచి మరో ఆరు సినిమాలు రాబోతున్నాయి. మూవీలో హీరో హీరోయిన్స్ కు చదువురాదు. చదువు రాని అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ఫన్నీ స్టోరీ ఇది. వంశీ నందిపాటి, బన్నీ వాస్ గారు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 200 థియేటర్స్ లో మా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 3న మూడు సెంటర్స్ లో ఫ్రీ షోస్ ఇంటర్ విద్యార్థుల కోసం వేస్తున్నాం. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తాం. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం' అని అన్నారు.

బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. శనివారం ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. 'లిటిల్ హార్ట్స్' ట్రైలర్ పై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. 

ALSO READ: Nagarjuna Akkineni: భక్తిరసం కురిపించిన నాగార్జున

Tribanadhari Barbarik Review: 'త్రిబాణధారి బార్బరిక్‌' సినిమా మెప్పించిందా..

Ram Pothineni: ఏ తెలుగు హీరో కొట్టని రికార్డ్‌ని కొట్టిన రామ్.. ఎలానో తెలుసా

Nikhil Nagesh Bhat: హాలీవుడ్ బాటలో కిల్ డైరెక్టర్

Updated Date - Aug 29 , 2025 | 06:21 PM