Akkineni Nagarjuna: తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన నాగ్..
ABN , Publish Date - Aug 12 , 2025 | 07:59 PM
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. హీరోగానే కాకుండా విలన్ గా కూడా తన సత్తా చాటాడానికి సిద్దమవుతున్నాడు.
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. హీరోగానే కాకుండా విలన్ గా కూడా తన సత్తా చాటాడానికి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం కూలీ. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఇక కూలీ ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున.. జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షోలో పాల్గొన్నాడు. మొట్ట మొదటిసారి జగ్గు భాయ్ హోస్ట్ గా మారి చేస్తున్న షో కావడంతో ఈ షోపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందులోనూ మొదటి గెస్ట్ గా కింగ్ అటెండ్ అవుతున్నాడు. ఇప్పటికే ఈ షో నుంచి రిలీజైన ప్రోమోస్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ షో నుంచి ఒక ఎమోషనల్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో నాగార్జున తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న బంధాన్ని, ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు.
ఏఎన్నార్ కొడుకుగా ఉన్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న ప్రశ్నకు నాగార్జున మాట్లాడుతూ.. 'ఏఎన్నార్ కొడుకుగా ఉండడం అంత ఈజీ కాదు. మా అన్న వెంకట్.. నాగ్, నువ్వెందుకు యాక్టింగ్ ట్రై చేయకూడదు అని అడిగాడు. వెంటనే నేను ఎస్ చేద్దాం అన్నాను. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి ఇలా అనుకున్నాం అనగానే ఆయన కళ్ళలో నీరు అలా కనిపించింది. అన్నమయ్య సినిమా వచ్చిన వెంటనే నా చేతులు ఇలా పట్టుకొని ఎంతో గర్వంగా తలాడించారు. అదే నాకు ప్రపంచం అనిపించింది. ఆయన బ్రతికినన్నాళ్లు ఎలా బ్రతకాలనుకున్నారో అలాగే బ్రతికారు' అని ఎమోషనల్ అయ్యాడు. ప్రసుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Aarsha Chandini Baiju: సూర్యపై క్రష్ ‘హౌస్‌మేట్స్’ హీరోయిన్
భాగ్యశ్రీ బోర్సే కోలీవుడ్ ఎంట్రీ ఖాయం