Akkineni Nagarjuna: జగపతి బాబుకి ఆ పాత్ర ఇస్తే.. మా స్నేహమే పోతుందని చెప్పాను
ABN , Publish Date - Aug 16 , 2025 | 02:17 PM
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంటుంది.
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున.. జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకు వెళ్లిన విషయం తెల్సిందే. సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) హోస్ట్ గా మారి ఈ టాక్ షోను నిర్వహిస్తున్నాడు. మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా నాగార్జున అటెండ్ అయ్యాడు. ఈ షోలో నాగార్జున తన మనోగతాన్ని మొత్తం బయటపెట్టాడు.
ఇక ఈ షోలో అక్కినేని నాగార్జున ఎథిక్స్ గురించి, అతని గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు కూడా సీనియర్ హీరోలను తీసుకుంటున్నారు. ప్రాధాన్యత లేకపోయినా కూడా పెద్ద పెద్ద బ్యానర్స్ అడగడంతో కాదనలేక సీనియర్ హీరోలు ఓకే అంటున్నారు. అందులో జగపతి బాబు కూడా ఉన్నాడు. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాలో ఒక చిన్న పాత్రకు జగపతి బాబును అనుకున్నారట. అయితే ఆ విషయం విన్న నాగార్జున వెంటనే రియాక్ట్ అయ్యి వద్దు.. జగపతి బాబును ఆ పాత్రకు తీసుకోవద్దు అని చెప్పాడట.
చిన్న పాత్రకు జగపతి బాబును తీసుకుంటారా.. మేము కలిసేదే అప్పుడప్పుడు. అలాంటింది ఇలాంటి పాత్రలు ఇస్తే మా స్నేహమే పోతుంది అని చెప్పిన్నట్లు నాగ్ చెప్పుకొచ్చాడు. ఆ విషయం తెలిసి జగపతి బాబు.. నాగార్జున అలా చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అందుకే నాగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎథిక్స్ అంటే గౌరవం అని చెప్పుకొచ్చాడు. దానికి నాగ్.. సినిమాలు, పాత్రలు కంటే ఫ్రెండ్షిప్ ముఖ్యం కదా అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Mass Jathara: మాస్ జాతర వాయిదా.. ఆ ప్లాపులే కారణమా
Dear Students Teaser: నయన్ మరో కొత్త ప్రయోగం.. డియర్ స్టూడెంట్స్ టీజర్ అదిరింది