Suriya: సూర్య - వెంకీ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరో..
ABN , Publish Date - Aug 18 , 2025 | 05:41 PM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya)కు ఈ మధ్యకాలంలో ఏది కలిసిరావడం లేదు. ఎంత మంచి కథ అనుకోని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నా వారు తిప్పి పంపించేస్తున్నారు.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya)కు ఈ మధ్యకాలంలో ఏది కలిసిరావడం లేదు. ఎంత మంచి కథ అనుకోని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నా వారు తిప్పి పంపించేస్తున్నారు. అయినా కూడా సూర్య ఎక్కడా తగ్గకుండా కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతూనే ఉన్నాడు. ప్రస్తుతం సూర్య చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి కరుప్పు(Karuppu) కాగా.. రెండు తెలుగులో వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 46. మూడోది స్క్రిప్ట్ పనుల్లో ఉంది. ప్రస్తుతం సూర్య ఆశలన్నీ ఈ సినిమాలపైనే పెట్టుకున్నాడు.
లక్కీ భాస్కర్ సినిమాతో వెంకీ అట్లూరి లక్కీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తరువాత వెంకీ మరో కొత్త కథతో సూర్యను ఒప్పించడం, దానిని సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించడం టకటకా జరిగిపోయాయి. ఇక పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న చిత్రబృందం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుండగా రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అనిల్ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కు తండ్రిగా నటించి మెప్పించాడు. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న అనిల్.. 45 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన వంశ వృక్షం అనే తెలుగు సినిమాలో కనిపించాడు. ఇన్నేళ్ల తరువాత సూర్య - వెంకీ సినిమాలో నటిస్తున్నాడు అని వార్తలు వినిపించాయి. ఇక ఈ వార్తలపై వెంకీ స్పందించాడు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో నిజమేమి లేదని, అనిల్ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ వచ్చే వార్తలో వాస్తవం లేదని చెప్పుకొచ్చాడు.
'మా సినిమాలో అనిల్ కపూర్ నటించడం లేదు. ఆయనను మేము ఇప్పటివరకు కలవనే లేదు. కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేదు. తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. ఇలాంటి వార్తలు ఎక్కడనుంచి పుట్టుకొస్తున్నాయి అనేది తెలియడం లేదు. ఇలాంటి తప్పుడు వార్తలను దయచేసి ఎవరూ నమ్మకండి. సూర్య 46 కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మేమే మీకు అధికారికంగా తెలియజేస్తాం' అని వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు. దీంతో అనిల్ కపూర్ టాలీవుడ్ రీఎంట్రీ మిస్ అయ్యిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Tribandhari Barbarik: చిరంజీవి బర్త్ డే కన్నారు... ఇప్పుడు వెనక్కి వెళుతున్నారు...