Tollywood: కార్పొరేట్ ఉద్యోగులం కాదు.. కష్ట జీవులం.. కాస్త ఆలోచించండి..
ABN, Publish Date - Aug 19 , 2025 | 01:12 PM
సినిమా పరిశ్రమకు చెందిన పలు శాఖలతో కలిసి కృష్ణనగర్ యూనియన్ ఆఫీస్‌లో మంగళవారం జరిగిన సమావేశం అనంతరం ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
సినిమా పరిశ్రమకు చెందిన పలు శాఖలతో కలిసి కృష్ణనగర్ యూనియన్ ఆఫీస్‌లో మంగళవారం జరిగిన సమావేశం అనంతరం ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘సోమవారం చిరంజీవిగారితో మూడు గంటలపాటు చర్చలు జరిగాయి. మాకు న్యాయం చేస్తే. సదలింపులకు ఓకే అని చెప్పాం. రెండు రోజుల్లో చిరంజీవి సమస్యను పరిష్కరిస్తామని మాటిచ్చారు.40 వేలమంది కార్మికులం ప్రభుత్వానికి అండగా ఉంటాం. మా సమస్యలు పరిష్కరించండి. కార్మికులను చిన్నచూపు చూసే నిర్మాతలను హెచ్చరిస్తున్నాం. సినిమా షూటింగ్స్‌కి నచ్చిన వారిని పెట్టుకుంటాం అన్నారు. మాలో నైపుణ్యం లేదంటున్నారు. తెలుగు కార్మికుల్లో స్కిల్ లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఎలా సినిమా వెళ్ళింది? అందుకు ఈ కార్మికులే కారణం. కార్మికులంతా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాం. వారిని చులకనగా చూస్తే ఊరుకోం. మూడు నెలల నుంచి వేతనాలు పెంచాలని నోటీసులు ఇస్తున్నాం. ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నాం. జూన్‌లో ఛాంబర్ మాతో చర్చలు జరిపింది. కానీ నిర్మాతలు లేబర్ కమిషనర్ దగ్గరకు వెళ్లారు. మొదట 5 శాతం పెంచుతామన్నారు. అందుకు నాలుగు నిబంధనలు పెట్టారు. డాన్సర్స్, ఫైటర్స్ రేషియో రద్దు చేయాలన్నారు. ఆదివారం డబుల్ పేమెంట్ ఇవ్వమన్నారు. 9 నుంచి 9 గంటల వరకు పని దినాలు అంటున్నారు. కార్మికులకు కడుపు కాలితే వాళ్లే పనిలోకి వస్తారని కించపరిచేలా కొందరు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ పద్దతి కాదు.
ALSO READ: Brahmanandam: నారాయణమూర్తి పులస చేప లాంటోడు...
సహకరిస్తామన్నా.. కనికరించడం లేదు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో మాట్లాడాం. మంత్రికి కార్మికుల కష్టాలు తెలిసిన వారు.. మాకు న్యాయం చేస్తామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాను అభివృద్ది చేయాలంటున్నారు. కాబట్టి కార్మికులకు న్యాయం చేయాలని ఆయన్ని కోరుతున్నాం. మేము కార్పొరేట్ ఉద్యోగులం కాదు. కష్ట జీవులం. 24 యూనియన్స్ లో దినసరి వేతనం తీసుకునేది 13 యూనియన్లు. అందులో పంది శాఖలకు పెంచుతామని మూడు యూనియన్‌లకు పెంచమని అంటున్నారు. మళ్లీ 30 శాతం పెంపు కుదరదంటున్నారు. మేం చిన్న సినిమాలకు పూర్తి సహకారం అందిస్తాం. నిర్మాతలకు అండగా ఉంటాం. చిన్న నిర్మాతలతో సమావేశమవుతాం. నిర్మాతలకు ఇబ్బందులు లేకుండా కార్మికులంతా సహకరిస్తామని మాటిచ్చాం. కానీ కనికరించడం లేదు. మూడు ఆదివారాలు సింగిల్ కాల్సీట్ అంటున్నారు. ఆదివారం ఇంట్లో పెళ్లాం పిల్లలను వదిలేసి వచ్చి కష్టపడతాం. అందుకే డబల్ కాల్షీట్ అడుగుతున్నాం. ఒక్క కాల్షీట్ 10 గంటలు ఉంటుంది. కానీ కార్మికులు 16 గంటలు కష్టపడుతున్నారు. అందుకే మేం కూడా న్యాయంగానే వేతనాల గురించి అడుగుతున్నాం’ అని అనిల్ అన్నారు.
ALSO READ: Kiara Advani: వరుసగా పరాజయాలే...
Thammareddy Bharadwaja: షూటింగ్‌లు ఆపడం అన్యాయం..