Thammareddy Bharadwaja: షూటింగ్‌లు ఆపడం అన్యాయం..
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:02 PM
సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. మంగళవారం కృష్ణానగర్‌లో ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు.
తెలుగు చిత్ర (tollywood) పరిశ్రమలో గత రెండు వారాలుగా చిత్రీకరణలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. సినీ కార్మికులు వేతనాలు పెంచాలంటూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. ఇప్పటి సినీ పెద్దలతో, ఛాంబర్‌తో పలు చర్చలు జరిగినా ఇంకా సమస్యకు పరిష్కారం దొరకలేదు. మంగళవారం కృష్ణానగర్‌లో ఫెడరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) మాట్లాడారు. ‘కార్మికుల వేతనాలు పెంచాలని అందరికీ తెలుసు. కానీ ఏదో ఒక వంకతో 16 రోజులుగా ఆలస్యం చేస్తున్నారు. ఒక్కరోజు పని లేకపోయినా బతకలేని వారు 50 శాతం మంది పరిశ్రమలో ఉన్నారు. వారి గురించి కాస్త అయినా ఆలోచించాలి కదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలకు పది రోజులు పని దొరకడం లేదు.
ALSO READ: Kiara Advani: వరుసగా పరాజయాలే...
సినీ కార్మికులకు సాఫ్ట్‌వేర్ కన్నా ఎక్కువ సంపాదన వస్తుందని కొందరు అంటున్నారు. నెలలో 30 రోజులూ పని ఉంటేనే అది సాధ్యం. నెలలో 30 రోజులు పని ఇస్తే జీతాలు పెంచాల్సిన అవసరం లేదు. 15 రోజులుగా షూటింగ్ పనులు ఆపడం అన్యాయం. నిర్మాతలు షూటింగ్‌లు ఆపుతున్నారు ఈ పద్దతి ఎక్కడా లేదు. అయితే నిర్మాతల గురించి కూడా సానుభూతిలో ఆలోచించాలి. నా నుండి ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా కార్మికులకు చేస్తాను. అవసరం ఉన్నప్పుడు కాకుండా అప్పుడప్పుప్పు ఇలా కలుస్తుండాలి. ప్రతి సంవత్సరం ఒక్క రోజు ఇలా కలిస్తే మన మాట అందరూ వింటారు’ అని అన్నారు.
ALSO READ: Tollywood: కార్పొరేట్ ఉద్యోగులం కాదు.. కష్ట జీవులం.. కాస్త ఆలోచించండి..
Nandamuri Padmaja: ఎన్టీఆర్ పెద్ద కోడలు మృతి..