Kiara Advani: వరుసగా పరాజయాలే...

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:52 AM

నటి కియారా అద్వానీని గత కొన్నేళ్ళుగా పరాజయాలు విడిచి పెట్టడం లేదు. వరుసగా ఆమె ఖాతాలో 'వార్ -2'తో ఐదో సినిమా జమ అయినట్టయ్యింది.

Kiara Advani

కియారా అద్వానీ (Kiara Advani)... హిందీలోనే కాదు తెలుగులోనూ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. ఈ యేడాది 'టాక్సిక్' మూవీతో శాండిల్ ఉడ్ లోకి కూడా అడుగుపెడుతోంది. కేవలం గ్లామర్ డాల్ గా కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న కియారా అద్వానీ కెరీర్ లో 'వార్ -2'కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో కియారా అద్భుతమైన యాక్షన్ సీన్స్ చేసింది. అయితే వాటి గురించి కాకుండా కేవలం ఆమె ధరించిన బికినీ గురించి మాత్రమే సోషల్ మీడియాలో అత్యధికంగా చర్చ జరిగింది. అయితే ఈ సినిమా పరాజయం పాలు కావడంతో కియారా అద్వానీ ఖాతాలో వరుసగా ఐదు చిత్రం చేరినట్టు అయ్యింది.


కియారా అద్వానీ కెరీర్ మొదలై పదకొండు సంవత్సరాలు అవుతోంది. యేడాది రెండు, మూడు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులోనూ 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాలలో నటించింది. తాజాగా ఈ యేడాది ఆమె నటించిన 'గేమ్ ఛేంజర్' కూడా విడుదలైంది. చివరి రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయితే... 2022లో వచ్చిన 'బోల్ భులయ్యా -2' తర్వాత కియారా అద్వానీకి చెప్పుకోదగ్గ సక్సెస్ దక్కలేదు. అదే యేడాది వచ్చిన 'జుగ్ జుగ్ జియో' (Jugjugg Jeeyo), 'గోవింద నామ్ మేరా' (Govind Naam Mera) సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక 2023లో వచ్చిన 'సత్యప్రేమ్ కి కథ' (Satyaprem Ki katha) కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. 2024లో అయితే కియారా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.


ఈ యేడాది ఇప్పటికే 'గేమ్ ఛేంజర్' (Game Changer) ఫ్లాప్ కాగా... తాజాగా 'వార్ 2' (War -2) కూడా అదే ఖాతాలో చేరింది. దాంతో కియారా వరుసగా ఐదు ఫ్లాప్స్ అందుకుని డబుల్ హ్యాట్రిక్ కు చేరువైందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి త్వరలో విడుదల కానున్న యశ్ మూవీ 'టాక్సిక్' (Toxic) అయినా విజయం సాధించి, ఈ అందాల ముద్దుగుమ్మను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. కియారా అద్వానీ జీవితంలో ఈ మధ్య కాలంలో జరిగిన ఆనందకర సంఘటన ఏదైనా ఉందంటే జూలై 15న ఆమె అందాల బిడ్డకు జన్మనివ్వడమే!

Also Read: Tuesday Tv Movies: మంగ‌ళ‌వారం.. తెలుగు టీవీ మాధ్య‌మాల్లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Also Read: Nandamuri Padmaja: ఎన్టీఆర్ పెద్ద కోడలు మృతి..

Updated Date - Aug 19 , 2025 | 11:52 AM

Kiara Advani Pregnant: ముందు ప్రెగ్నెన్సీ.. తర్వాత పెళ్లి.. ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారని సెటైర్లు వేసిన కేఆర్కే

Kiara Advani: అలాంటి జ్ఞాపకాలు ఎన్నో పోగేసుకున్నా!

Kiara Advani: కియారా ఆడ్వాణీ కిర్రాక్!

Kiara Advani: కియారా దెబ్బ‌.. త‌గ‌ల‌బ‌డుతోన్న సోష‌ల్‌మీడియా

Kiara Advani: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ