Rashmika Mandanna: నా టైప్ ఎవరో అందరికీ తెలుసు..
ABN , Publish Date - Oct 25 , 2025 | 06:01 PM
ఈ ఏడాది ఒక్క ప్లాప్ కూడా లేకుండా హిట్ అందుకున్న హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది రష్మిక మందన్నా(Rashmika Mandanna)నే అని చెప్పాలి. పుష్ప 2 దగ్గర నుంచి థామా వరకు ఈ చిన్నది వరుస విజయాలను అందుకుంటూనే ఉంది.
Rashmika Mandanna: ఈ ఏడాది ఒక్క ప్లాప్ కూడా లేకుండా హిట్ అందుకున్న హీరోయిన్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది రష్మిక మందన్నా(Rashmika Mandanna)నే అని చెప్పాలి. పుష్ప 2 దగ్గర నుంచి థామా వరకు ఈ చిన్నది వరుస విజయాలను అందుకుంటూనే ఉంది. పాన్ ఇండియా లెవెల్లో అమ్మడి రేంజ్ మారిపోయింది. గోల్డెన్ లెగ్ రష్మిక అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ మధ్యనే ఈ చిన్నదానికి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రేమలో మునిగితేలుతున్న ఈ భామ ఎట్టకేలకు అతడితోనే పెళ్ళికి సిద్దమయ్యింది.
అయితే ఇప్పటివరకు ఈ జంట బయట కనిపించలేదు. అధికారికంగా వారి నిశ్చితార్దాన్ని ప్రకటించలేదు. అయినా కూడా వీరిద్దరూ అభిమానులకు హింట్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. నటుడు, డైరెక్టర్ అయిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను బట్టి ఇది సాధారణ లవ్ స్టోరిలా అనిపించడం లేదు. ప్రేమలో ఎవరు ఎవరి టైప్ అని తెలుసుకోవడం ముఖ్యం. ప్రేమించిన వారు మనకు సరిపోతారా.. ? వాళ్ళు మనకు కరెక్ట్ యేనా కాదా అనేది ఆలోచించుకోవాలి అని ట్రైలర్ లో చూపించారు.
ఈ ట్రైలర్ ఈవెంట్ లో రష్మిక కూడా అదే చెప్పింది. అయితే రష్మిక టైప్ ఎవరు.. ? రష్మిక ఏ టైప్ అబ్బాయిని ఎంచుకుంటుంది అన్న ప్రశ్నకు రష్మిక సిగ్గుపడుతూ ఉండగా వెనుక ఈవెంట్ కు వచ్చినవారు రౌడీ.. రౌడీ అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు. దీంతో రష్మిక.. అందరికీ తెలుసు.. నా టైప్ ఎవరో అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా పిలుస్తామని అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. నిజంగా విజయ్ ఈ ఈవెంట్ కు వస్తే కనుక ఎంగేజ్ మెంట్ తరువాత మొదటిసారి జంటగా కనిపిస్తారు. దీనికోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో రష్మిక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Prashanth Neel: నా దొంగ మొగుడు.. నీల్ భార్య క్యూట్ పోస్ట్ వైరల్
Mass Jathara: ‘మాస్ జాతర’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే..