Fauji: ‘ఫౌజీ’ గురించి ఆ వార్త నిజమేనా

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:56 PM

ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

ప్రభాస్‌ (Prabhas) హీరోగా హను రాఘవపూడి 9hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’ (fauji) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ఇమాన్వీ కథానాయికగా పరిచయమవుతుంది. బిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఎలాంటి వివరాలు బయటకు రానివ్వకుండా మేకర్స్‌ చిత్రీకరణ చేస్తున్నారు. అత్యంత గోప్యంగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

1940 నేపథ్యంలో జరిగే హిస్ట్టారికల్‌ రొమాంటిక్‌ డ్రామాగా ‘ఫౌజీ’ తెరెకెక్కబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 60ు శాతం షూటింగ్‌ పూర్తయినట్టు తెలిసింది. ఇంకా ప్రభాస్‌కు 35 రోజుల షూటింగ్‌ పోర్షన్‌ మిగిలి ఉంది. అయితే ఈ సినిమా తర్వాత ‘ఫౌజీ ప్రీక్వెల్‌’ కూడా ఉంటుందంటున్నారు. అంతా అనుకూలిస్తే వచ్చే ఏడాది ఆగస్టు నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ‘మైత్రీ మూవీస్‌’ సంస్థ ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం.

విశాల్‌ చంద్ర శేఖర్‌ ఈ చిత్రానికి  సంగీతం అందిస్తున్నారు.  దర్శకుడు హనూ రాఘవపూడి సున్నితమైన భావోద్వేగాలను చిత్రీకరించడంలో సిద్థహస్తుడు కావడంతో, చాలా కాలం తరువాత ప్రభాస్‌ నుంచి ప్రేమ కథ కావడంతో ‘ఫౌజీ’పై అంచనాలు భారీగా ఉన్నాయి. 

Updated Date - Oct 12 , 2025 | 02:01 PM