Ram Charan: పీక్స్ కు చేరిన 'పెద్ది' పై హైప్
ABN , Publish Date - Sep 07 , 2025 | 06:59 PM
కొన్ని సినిమాలకు ప్రమోషన్స్ అవసరం లేదు. ఎవరో ఒకరు చిన్న మాట చెప్పినా.. అప్డేట్ ఇచ్చినా సోషల్ మీడియాను అది దావానలంలా చుట్టేస్తుంది. మెగా పవర్ స్టార్ అప్ కమింగ్ మూవీ గురించి చిత్ర బృందం చేసిన కామెంట్ ఇప్పుడు అదే తీరున సాగుతోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan), బాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జోడీగా.. 'ఉప్పెన' (Uppena) ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchchibabu Sana) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ 'పెద్ది' (Peddi). 'ఆర్ఆర్ఆర్' తర్వాత సాలిడ్ హిట్ కోసం చరణ్ కసిగా పనిచేస్తుండటంతో.. ఈ మూవీ గురించి అభిమానులు ఎగ్జయింటింగ్ గా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ రగ్డ్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ ఇప్పటికే అరిస్తున్నాయి. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ (A.R. Rahman) సంగీతం, రత్నవేలు (Rathnavelu) సినిమాటోగ్రఫీతో 'పెద్ది' విజువల్ ఫీస్ట్‌గా మారబోతోందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచాయి.
రామ్ చరణ్ ఈ సినిమాలో తన నటనతో బ్రాండ్ న్యూ అవతార్‌లో రెచ్చిపోబోతున్నాడని 'రంగస్థలం' తర్వాత మరోసారి తన స్క్రీన్ మ్యాజిక్‌తో అభిమానులను కట్టిపడేస్తాడని రత్నవేలు చేసిన కామెంట్స్ తో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయిందని, సాలిడ్ స్క్రిప్ట్‌తో టోటల్ డిఫరెంట్ వైబ్‌లో షూట్ చేస్తున్నామని రత్నవేలు రివీల్ చేశాడు. పైగా రామ్ చరణ్ లోని మరో కొత్త కోణం చూస్తారని చేసిన ఈ కామెంట్స్ తో హైప్ పీక్స్ కు చేరగా, ఈ విషయం విన్న ఫ్యాన్స్ దిల్ ఖుషి అవుతోంది.' గేమ్ ఛేంజర్' (Game Changer) తో నిరాశ చెందిన అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి రత్నవేలు మాటలు.
ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ చరణ్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలుస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్. పైగా రామ్ చరణ్ రఫ్ అండ్ టఫ్ లుక్‌లో దుమ్మురేపనున్నాడని మేకర్స్ కూడా గట్టిగా చెబుతున్నారు. ఈ నెలలో ఫస్ట్ సింగిల్ కు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం 'పెద్ది' మైసూర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ లాంటివారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో సెట్స్ పై ఉండగానే పెద్ది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. చూడాలి మరి రిలీజ్ తర్వాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో!
Also Read: Nithiin: కొడుకు తొలి బర్త్‌డే.. హీరో నితిన్ ఎమోషనల్ పోస్ట్
Also Read: Simran: గుర్తుపట్టలేనంతగా మారిన సిమ్రాన్..