Peddi: గౌర్నాయుడుగా శివన్న.. ఆసక్తికరంగా లుక్..
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:10 AM
శనివారం శివన్న పుట్టినరోజును సందర్భంగా చిత్రబృందం సర్‌ప్రైజ్ ఇచ్చింది. పెద్ది సినిమా నుంచి శివన్న లుక్‌ను రివీల్ చేసింది.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు (Buchibabu Sana) దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఇందులో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. శనివారం శివన్న పుట్టినరోజును సందర్భంగా చిత్రబృందం సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇందులో శివన్న లుక్‌ను రివీల్ చేసింది. గౌర్నాయుడు (shivanna as gournayudu) పాత్రలో ఆయన కనిపించనున్నారని కొత్త పోస్టర్ విడుదల చేసి తెలిపారు. పోస్టర్లో చూస్తే గ్రామపెద్ద తరహాగా ఆయన కనిపించనున్నారనిపిస్తుంది. ‘‘హ్యాపీ బర్త్‌డే డియర్ శివన్న. మీలాంటి లెజండరీ ఆర్టిస్ట్ సానుకూల దృక్పథం కలిగిన గొప్ప వ్యక్తితో కలిసి వర్క్ చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నా. సెట్‌లో మీరు ఉన్నారంటే ఎంతో స్ఫూర్తినిస్తుంది. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నా’’ అని బుచ్చిబాబు పోస్ట్ పెట్టారు.
రామ్‌చరణ్ నటిస్తున్న 16వ చిత్రమిది జాన్వీకపూర్ కథానాయిక. గ్రామీణ నేపథ్యం, క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉండనుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఫిక్షనల్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు బుచ్చిబాబు ఓ వేదికపై చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 2026 మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.