సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Federation Bandh: ఆ వార్తలు నమ్మోద్దంటున్న చిరు

ABN, Publish Date - Aug 09 , 2025 | 06:05 PM

'ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు నేను వారిని కలిశానని, వారు కోరిన విధంగా 30 శాతం వేతన పెంపు వంటి డిమాండ్లను నెరవేరుస్తానని హామీ ఇచ్చాన'ని చెబుతున్న వార్తల్లో నిజం లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు.

Chiranjeevi

గత సోమవారం నుండి జరుగుతున్న సినీ కార్మికుల సమ్మె ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber), ఫెడరేషన్ (Federation) నాయకుల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అలానే లేబర్ కమీషన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ దిల్ రాజు సైతం దీని పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని వార్తలపై మెగాస్టార్ చిరంజీవి (Chirajeevi) ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు.


'ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు నేను వారిని కలిశానని, వారు కోరిన విధంగా 30 శాతం వేతన పెంపు వంటి డిమాండ్లను నెరవేరుస్తానని హామీ ఇచ్చాన'ని చెబుతున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. త్వరలోనే తాను షూటింగ్ ప్రారంభిస్తానని కూడా వారితో అన్నట్టు మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చిరంజీవి అన్నారు. ఈ విషయమై ఆయన ఇంకా ఆ పోస్ట్ ఇలా తెలియచేశారు. 'నేను ఫెడరేషన్ కు చెందిన ఏ ఒక్కరిని కలవలేదని నిరూపించగలను. అలానే సినిమా పరిశ్రమకు చెందిన ఓ సమస్యను ఒక వ్యక్తి ఒక విధంగానో, మరో విధంగానో ఏకపక్షంగా పరిష్కరించడం జరిగేది కాదు. ఫిల్మ్ ఛాంబర్ అనేది తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన అత్యున్నత సంస్థ. కేవలం ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే సమిష్టిగా సంబంధిత వ్యక్తలతో చర్చలు జరిగి న్యాయమైన పరిష్కారం కనుగొంటుంది. అప్పటి వరకూ వేచి ఉండాలి తప్పితే... ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు. ఈ రంగానికి చెందిన వారి మధ్య గందరగోళం సృష్టించడానికి నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను' అని చిరంజీవి ఎక్స్ లోని పోస్ట్ లో పేర్కొన్నారు.

నిజానికి ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులు బంద్ కు పిలుపును ఇవ్వగానే కొందరు తెలుగు నిర్మాతలు చిరంజీవిని కలిసి, వారి సమస్యలను విన్నవించారు. అయితే చిరంజీవి ఫెడరేషన్ నాయకుల వాదన కూడా తాను వింటానని వారితో చెప్పినట్టు తెలిసింది. ఇంతవరకు ఫెడరేషన్ కార్యవర్గం చిరంజీవిని కలవలేదు. అయితే చిరంజీవిని కలిసినట్టుగానే నిర్మాతలు బాలకృష్ణనూ కలిసి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అయితే... చిరంజీవిని నిర్మాతలు కలవడాన్ని సీపీఐ నాయకుడు నారాయణ (CPI Narayana) తప్పు పట్టారు. వ్యక్తిగా ఆయన ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారని, ఆయన్ని అసలు నిర్మాతలు కలవడమే తప్పు అని నారాయణ అన్నారు. ఏదేమైనా ఇప్పుడు చిరంజీవి సైతం ఫిల్మ్ ఛాంబర్ తో చర్చలు జరిపి, ఫెడరేషన్ నాయకులు దీనికో పరిష్కారం వెదుక్కోవాలని తేల్చి చెప్పేశారు.

Also Read: Vadde Naveen: మరోసారి ఓల్డ్ ట్రాక్ లో...

Also Read: Kaantha: దుల్కర్ కెరీర్ లో మరో చార్ట్ బస్టర్ సాంగ్ అయ్యేట్టుగా ఉందే

Updated Date - Aug 09 , 2025 | 06:05 PM