Kaantha: దుల్కర్ కెరీర్ లో మరో చార్ట్ బస్టర్ సాంగ్ అయ్యేట్టుగా ఉందే
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:26 PM
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సే (Bhagyasree Borse) జంటగా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కాంత(Kaantha).
Kaantha: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సే (Bhagyasree Borse) జంటగా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కాంత(Kaantha). స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 12 న కాంత అన్ని భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా మొదటి సింగిల్ ను రిలీజ్ చేశారు. హే.. పసిమనసే.. వినదసలే అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. జాను చంథర్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. లిరిక్స్ కు తగ్గట్లు ప్రదీప్ కుమార్, ప్రియాంక NK తమ అద్భుతమైన వాయిస్ తో ఆలపించారు. ఇక వీడియోలో దుల్కర్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ ఎంతో ఫ్రెష్ గా కనిపిస్తుంది. 1950లో తెరకెక్కిన సినిమాలో వచ్చే రొమాంటిక్ సాంగ్ లా కనిపిస్తుంది.
సాంగ్ చాలా కొత్తగా కనిపిస్తుంది. బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో దుల్కర్ కనిపించగా.. రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో భాగ్యశ్రీ కనిపించింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. దుల్కర్ ముందు సాంగ్స్ లానే ఈ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక భాగ్యశ్రీ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలను పెట్టుకుంది. ఇప్పటికే ఆమె నుంచి వచ్చిన రెండు సినిమాలు పరాజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాఅయినా మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.