సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi : బాబీ బలే ముందుకొచ్చేశాడే...

ABN, Publish Date - Aug 23 , 2025 | 11:24 AM

చిరంజీవి సినిమాల ఆర్డర్ లో చిన్నపాటి మార్పు జరిగింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసే మూవీ కాస్తంత వెనక్కి వెళ్ళి, బాబీ సినిమా ముందుకు వచ్చింది... కారణం ఏంటంటే...

Chiranjeevi Movies

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న సోషల్ మీడియాలో ఆయన అభిమానులు చెలరేగిపోయారు. మెగాభిమానులే కాకుండా సినిమా రంగానికి చెందిన తోటి హీరోలు, నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు సైతం చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు. అలానే చిరంజీవి తాజా చిత్రాలు 'విశ్వంభర' (Vishwambhara), 'మన శంకర వర ప్రసాద్ గారు (Mana Sankara Vara Prasad garu)' సినిమాలకు సంబంధించిన గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. దీనితో పాటు చిరంజీవితో బాబీ (Bobby) మరోసారి సినిమా చేయబోతు న్నాడనే వార్త కూడా అధికారికంగా వెలువడింది. అలానే చిరు - శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబోలో నాని నిర్మించే సినిమా ఉండనే ఉంది. అయితే ఇక్కడే చిరు బర్త్ డే రోజు చిన్నపాటి ట్విస్ట్ జరిగింది.


చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'విశ్వంభర' షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. అయితే దానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ కు ఏకంగా ఏడెనిమిది నెలల సమయం పడుతుందని తెలుస్తోంది. అందుకే చిరంజీవి స్వయంగా ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్ స్పెషల్ గా వస్తుందని చెప్పేశారు. ఇక చిరుతో అనిల్ రావిపూడి తీస్తున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' ఖచ్చితంగా సంక్రాంతికి వస్తుంది. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరో ఒకటి రెండు షెడ్యూల్స్ తో అది కూడా పూర్తవుతుంది. మరి ఆ తర్వాత చిరంజీవి ఏ సినిమా చేస్తారనే ప్రశ్నకు నిన్న సమాధానం లభించేసింది.


ఎందుకంటే నాని నిర్మాతగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయడానికి చిరంజీవి గత యేడాది డిసెంబర్ నెలలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అది నాని 'ప్యారడైజ్' మూవీ తర్వాతే సెట్స్ పైకి వెళుతుందనేది ఖాయం. కానీ 'ప్యారడైజ్' షూటింగ్ అనుకున్నంత వేగంగా సాగకపోవడంతో శ్రీకాంత్ ఓదెల మరికొంతకాలం ఆ ప్రాజెక్ట్ మీద ఉండాల్సిన పరిస్థితి. మరి ఈ సమయంలో చిరంజీవి ఏం చేయాలన్నది అందరకూ వచ్చే సందేహం. దానికి తెర దించుతూ, చిరంజీవి 158వ సినిమాగా బాబీ డైరెక్షన్ లో మూవీ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. సో... ఇమ్మీడియెట్ గా చిరంజీవి చేసే సినిమా బాబీ డైరెక్షన్ లోనే. ఆ తర్వాతే శ్రీకాంత్ ఓదెల మూవీ ఉంటుంది. చిత్రం ఏమంటే... 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ పూర్తి ఎంటర్ టైన్ మెంట్ వే లో ఉంటుందని అందరూ అనుకుంటున్నారు కానీ అందులోనూ కావలసినంత యాక్షన్ కు చోటు ఉందని తాజాగా వచ్చిన టైటిల్ గ్లింప్స్ ద్వారా చెప్పేశాడు అనిల్ రావిపూడి. అంతేకాదు... 'సంక్రాంతికి వస్తున్నాం'లోని వెంకటేశ్‌ పాత్రనే... ఇందులో క్లయిమాక్స్ లో చూపిస్తారని కూడా తేలిపోయింది. అంటే ఇది ఒకరకంగా అనిల్ రావిపూడి ఫిల్మీ యూనివర్స్ అన్నమాట. ఇక 'విశ్వంభర' కథ భిన్నమైనదే అయినా... అందులోనూ యాక్షన్ కు బాగానే స్కోప్ ఉంది. ఆ విషయం గురువారం రాత్రి వచ్చిన మెగా బ్లాస్ట్ గ్లింప్స్ చూస్తే అర్థమైంది. ఇక బాబీ మూవీ అనౌన్స్ మెంట్ పోస్టర్, శ్రీకాంత్ ఓదెల మూవీ పోస్టర్స్ చూస్తే... ఈ రెండు సినిమాల యు.ఎస్.పి. యాక్షనే అని అర్థమౌతోంది. సో... 2026, 2017లో మెగాభిమానులు మాస్ చిరంజీవిని చూడబోతున్నారని అనుకోవచ్చు.

Also Read: Vedhika: బికినీలో వేదిక.. కుర్రాళ్లకు నిద్ర పట్టేలా లేదికా...

Also Read: Yandamuri: సంబంధంలేని విషయాల్లో చిరంజీవి వేలు పెట్టరు...

Updated Date - Aug 23 , 2025 | 11:26 AM