Vedhika: బికినీలో వేదిక.. కుర్రాళ్లకు నిద్ర పట్టేలా లేదికా

ABN , Publish Date - Aug 22 , 2025 | 09:33 PM

అందం, అభినయం ఉన్నా కొందరికి లక్ కలిసిరాక స్టార్స్ కాలేరు. అలాంటి హీరోయిన్స్ లో వేదిక (Vedhika) కూడా ఒకరు.

Vedhika

Vedhika: అందం, అభినయం ఉన్నా కొందరికి లక్ కలిసిరాక స్టార్స్ కాలేరు. అలాంటి హీరోయిన్స్ లో వేదిక (Vedhika) కూడా ఒకరు. అందానికి అందం, నటన, గ్లామర్ ను ఒలకబోయడానికి సై అన్నా కూడా వేదికకు సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. అడపాదడపా సినిమాలు, సిరీస్ లు చేస్తుంది కానీ, ఇప్పటివరకు అమ్మడిని గుర్తుపెట్టుకొనే ఒక్క సినిమా కూడా రాలేదు. అయినా కూడా వేదిక నిరాశపడకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తెలుగు మాత్రమే కాకుండా ఏ భాషలో అవకాశం వచ్చినా కూడా వదలకుండా పట్టుకొని విజయం కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది.

🌊 (1).jpg


ఇక యక్షిణి సిరీస్ తో తెలుగువారికి దగ్గరైన వేదిక ప్రస్తుతం వేరే భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. సినిమాల విషయం పక్కన పెడితే.. వేదిక అందాల ఆరబోతతోనే ఫేమస్ అయ్యిందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. సినిమాలతో కాకపోయినా.. తన గ్లామర్ ఫొటోలతో అభిమానులను తన వెనుక తిప్పుకొనేలా చేస్తోంది వేదిక.

🌊.jpg


నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో వేదిక కుర్రకారుకు కునుకు లేకుండా చేయడంలో మొదటి వరుసలో ఉంటుంది. ముఖ్యంగా బికినీలో ముద్దగుమ్మ అందాల ఆరబోతకు ఫిదా కానీ అభిమాని లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా మరోసారి వేదిక బికినీ ట్రీట్ తో కుర్రాళ్ల మతులు పోగొట్టేసింది. ఆరెంజ్ కలర్ బికినీలో గాగుల్స్ పెట్టుకొని.. రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ లోకి వయ్యారంగా దిగుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక ఇంత సుందరాంగి బికినీలో కనిపిస్తే కుర్రాళ్ళు ఆగుతారా.. తమ మతులు పోతున్నాయి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మా అన్నయ్య సినిమాలో రాజశేఖర్ పాడిన పిల్ల భలే.. దీని ఫిగరూ భలే అంటూ పాట అందుకుంటున్నారు.

Srikanth Odela: నీయమ్మ.. జీవితకాలం ఆడే సినిమారా చిరంజీవి

Mega 158: బెంచ్ మార్క్ సెట్ చేయడానికి మళ్లీ వస్తున్న బాబీ- చిరు

Updated Date - Aug 22 , 2025 | 09:33 PM