Mana ShankaraVaraprasad Garu: మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు.. పండ‌క్కి వ‌చ్చేస్తున్నారు

ABN , Publish Date - Aug 22 , 2025 | 12:07 PM

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మెగా157 టైటిల్‌తో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.

Mana ShankaraVaraprasad Garu

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో మెగా157 టైటిల్‌తో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. శ‌ర వేగంగాఇ షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ‌చివ‌రి ద‌శ‌లో ఉంది. వ‌చ్చే సంక్రాంతికి థియేట‌ర్ల‌లోకి రానుంది. అయితే శుక్ర‌వారం చిరంజీవి జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మేక‌ర్స్ ఈ సినిమా టైటిల్ మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు పండ‌క్కి వ‌చ్చేస్తున్నారు (Mana ShankaraVaraprasad Garu) అని రివీల్ చేస్తూ ఓ గ్లిమ్స్ వీడియో విడుద‌ల చేశారు.

తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ అభిమానుల్లోస‌రి కొత్త ఉత్సాహాన్ని నింనింద‌న‌డంలో ఎలాంటి అత్యుత్సాం లేదు. సినిమా ప్ర‌క‌టించిన నాటి నుంచే చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికపై ఎప్పటి నుంచో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. సంక్రాంతికి వ‌స్తున్నాం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అనీల్ ఇమేజ్ అమాంతం పెరిగి పోవ‌డం, అయ‌న అందించే కామెడీ మ‌రో లెవ‌ల్ అనే పేరు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే అనీల్‌కు మెగాస్టార్ చిరంజీవి తోడ‌వ‌డంతో ఈ సినిమాలో చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, మాస్ అప్పీల్ ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.

ఇక గ్లింప్స్‌ విష‌యానికి వ‌స్తే.. బాస్ అంటూ వ‌చ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చిరంజీకి కొత్త మేకోవర్ లో సూట్ లో స్టైల్ గా సిగరేట్ తాగుతూ.. చేతిలో తుపాకితో ఓ సీన్ లో..గుర్రాన్ని పట్టుకుని సిగరేట్ కాలుస్తూ వింటేజ్ లుక్ లో మెస్మ‌రైజ్ చేసేలా స‌రికొత్తగా కనిపించారు. అంతేగాక‌ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రౌడీ అల్లుడు ట్యూన్‌, చిరంజీవి ఎంట్రీ అన్నీ అభిమానుల్లో వింటేజ్ బాస్‌ "మాస్ ఫెస్టివల్"ను గుర్తు చేస్తున్నాయి. చివ‌ర‌లో మన శంకర్ వరప్రసాద్ గారు పండడ‌క్కి వస్తున్నారంటూ విక్టరీ వెంకటేష్ వాయిస్ ఒవర్ తో టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా మెగా అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు కూడా ఒక ప్రత్యేకమైన వినోదాన్ని అందించనుంది. ఇప్పటికే హైప్ పీక్స్‌లో ఉన్న ఈ చిత్రం, టైటిల్ గ్లింప్స్ తో మరింతగా అంచనాలను పెంచేసింది. 2026 సంక్రాంతికి ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవ‌నుంది.

Updated Date - Aug 22 , 2025 | 12:24 PM