Nandamuri Balakrishna: పట్టాలెక్కబోతున్న బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా...
ABN, Publish Date - Oct 02 , 2025 | 05:08 PM
బాలకృష్ణ, మలినేని గోపీచంద్ కాంబినేషన్ లో మరో సినిమా మొదలు కాబోతోంది. వెంకట సతీశ్ కిలారు నిర్మించే ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 24న ప్రారంభం కానుంది.
నందమూరి నట సింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ (Balakrishna) కొత్త సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. నందమూరి బాలకృష్ణ, మలినేని గోపీచంద్ (Malineni Gopichand) కాంబినేషన్ లో వచ్చిన 'వీర సింహారెడ్డి' (Veerasimha Reddy) చిత్రం 2023 సంక్రాంతి కానుకగా వచ్చి ఘన విజయం సాధించింది. దాంతో మలినేనితో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. అది ఇప్పుడు కార్యరూపం దాల్చింది. బాలకృష్ణ, మలినేని గోపీచంద్ తో 'వీర సింహారెడ్డి' చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే ఈ సినిమా కూడా ఉంటుందని అప్పట్లో వినిపించింది. అయితే ఇప్పుడీ సినిమాను రామ్ చరణ్ తో 'పెద్ది' సినిమా నిర్మిస్తున్న వెంకట్ సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.
దసరా సందర్భంగా నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ -2' (AKhanda-2) సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. బాలకృష్ణ చెప్పినట్టుగానే ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అక్టోబర్ 2నే బాలకృష్ణ, మలినేని గోపీచంద్ మూవీ కూడా ప్రారంభం అవుతుందనే వార్తలు వచ్చాయి. అయితే... ఈ సినిమా షూటింగ్ ను అక్టోబర్ 24న ప్రారంభిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇది నందమూరి బాలకృష్ణకు 111వ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే... బాలకృష్ణ 'ఆదిత్య 369'కు కొనసాగింపుగా 'ఆదిత్య 999' మూవీని కూడా చేయబోతున్నట్టు ప్రకటించారు.
Also Read: Chiru - Udit Narayan: మన ఎలివేషన్ కంటే ఉదిత్ ఎమోషన్ స్ట్రాంగ్ అయ్యా..
Also Read: Little Hearts: చిన్న మార్పులతో.. హిట్టు సినిమాకు సీక్వెల్