Gopichand Malineni: ‘క్రాక్’ చూసిన తర్వాత కఠారి కృష్ణ రియాక్షన్ ఏంటంటే.. (OHRK Promo 2)

ABN , First Publish Date - 2023-01-21T17:15:16+05:30 IST

తెలుగు సినిమా ఇండస్ట్రీ కరోనా కష్టకాలంలో ఉన్న సమయంలో ‘క్రాక్’ (Krack) వంటి విజయంతో ఇండస్ట్రీని కళకళలాడించిన దర్శకుడు..

Gopichand Malineni: ‘క్రాక్’ చూసిన తర్వాత కఠారి కృష్ణ రియాక్షన్ ఏంటంటే.. (OHRK Promo 2)
Director Gopichand Malineni at Open Heart With RK

తెలుగు సినిమా ఇండస్ట్రీ కరోనా కష్టకాలంలో ఉన్న సమయంలో ‘క్రాక్’ (Krack) వంటి విజయంతో ఇండస్ట్రీని కళకళలాడించిన దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni). అలాంటి దర్శకుడికి అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే.. ఎలా ఉంటుందో సంక్రాంతికి వచ్చిన ‘వీరసింహారెడ్డి’ చిత్రంతో చూపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా సక్సెస్‌తో ఆనందంలో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (Open Heart with RK) కార్యక్రమంలో పాల్గొని సినిమాకు సంబంధించిన విషయాలే కాకుండా.. తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో 1 ఇప్పటికే విడుదలై ట్రెండ్ అవుతోంది. తాజాగా ప్రోమో 2 విడుదలైంది. ఇందులో.. (Open Heart with RK Promo)

* తమిళ వాళ్లు తీసే రా సినిమాలు మనమెందుకు తీయకూడదు, ఎందుకు మన సినిమా రిఫరెన్స్ అవకూడదు.. అలా అనుకునే ‘క్రాక్’ (Krack Movie) సినిమా చేశాను

* ఒంగోలులో కఠారి కృష్ణ (Katari Krishna) ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. రౌడీయిజం అంతా మానేసి.. ఒంగోలు మార్కెట్ యార్డ్‌లో ఉల్లిపాయల కొట్టు పెట్టుకున్నాడు. అలాగే జయమ్మ కూడా ఉంది. రియల్ లైఫ్‌లో కూడా ఆమె పేరు జయమ్మే. కఠారి కృష్ణ ‘క్రాక్’ సినిమా చూసిన తర్వాత.. ‘నేను జయమ్మ (Jayamma)ని చంపలేదు కదా.. అదొక్కటే నచ్చలేదబ్బాయ్’ అని అన్నాడంట.

* వేటపాలెం సీన్‌ సంబంధించి.. ఇప్పటికీ గాడిద రక్తం తాగేసి.. అది బాడీకి పట్టాలని 10 నిమిషాలు పరుగెడుతుంటారు.

* ఒంగోలులో అప్పట్లో కరెంట్ పోతే మర్డర్ జరుగుతున్నట్లే లెక్క. కరెంట్ పోయిందంటే.. మర్డరే. అది బాగా పాపులర్ అయింది.

* ఇప్పటి వరకు నేను చేసిన ఏ సినిమాకు.. నిర్మాతలు పూర్తిగా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. ఫస్ట్ టైమ్.. నా లైఫ్ టైమ్‌లో ఒక్క ‘వీరసింహారెడ్డి’కి మాత్రమే పూర్తి రెమ్యూనరేషన్ వచ్చింది. ‘క్రాక్’ అంత పెద్ద హిట్ అయినప్పటికీ పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు... ఇలాంటి ఎన్నో విషయాలను గోపీచంద్ మలినేని ఈ కార్యక్రమంలో షేర్ చేసుకున్నారు. ఆ విషయాలన్ని తెలియాలంటే ఆదివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ABN ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart with RK) ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Updated Date - 2023-01-21T17:23:51+05:30 IST