Gopichand Malineni: గిఫ్ట్ ఇస్తూ.. మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే..? (OHRK promo)

ABN , First Publish Date - 2023-01-20T21:38:28+05:30 IST

రవితేజ (Ravi Teja)కి, నాకు పోలికలు ఉన్నాయని చాలా మంది చెప్పారు. షూటింగ్‌లోని కొన్ని కొన్ని షాట్స్‌లో.. ‘అబ్బాయ్ నేను వెళుతున్నా.. నువ్వు నుంచో’ అని రవితేజ వెళ్లిపోయేవారు. ఇంకా..

Gopichand Malineni: గిఫ్ట్ ఇస్తూ.. మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారంటే..? (OHRK promo)
Director Gopichand Malineni at Open Heart With RK

తెలుగు సినిమా ఇండస్ట్రీ కరోనా కష్టకాలంలో ఉన్న సమయంలో ‘క్రాక్’ (Krack) వంటి విజయంతో ఇండస్ట్రీని కళకళలాడించిన దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni). అలాంటి దర్శకుడికి అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే.. ఎలా ఉంటుందో సంక్రాంతికి వచ్చిన ‘వీరసింహారెడ్డి’ చిత్రంతో చూపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా సక్సెస్‌తో ఆనందంలో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (Open Heart with RK) కార్యక్రమంలో పాల్గొని సినిమాకు సంబంధించిన విషయాలే కాకుండా.. తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో.. (Open Heart with RK Promo)

* ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) షూటింగ్ మొదలైన ఫస్ట్ డే నుంచి ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అందుకే సంక్రాంతి (Sankranthi)కి రెండు సినిమాలు వచ్చినా.. పర్లేదని అనుకున్నాం. రెండు బ్లాక్‌బస్టర్ అవుతాయనే నమ్మకంతో ఉన్నాం.

* అభిమానించే హీరోని డైరెక్ట్ చేస్తున్నప్పటికీ.. నేనొక డైరెక్టర్‌ని.. అక్కడొక ఆర్టిస్ట్ ఉన్నారు.. ఇదే మనసులో పెట్టుకున్నా.. అంతే.

* ‘వీరసింహారెడ్డి’లో కావాలని మాత్రం డైలాగ్స్ పెట్టలేదు.

* డైరెక్టర్స్‌కి ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే. ఎంత సక్సెస్ అయినప్పటికీ.. అది 10, 15 రోజులు మాత్రమే కనిపిస్తుంది.

* ఇంటర్ కూడా పూర్తి కాలేదు.. ఎందుకంటే.. కరెక్ట్‌గా కాంపౌండ్‌కి అనుకునే మూడు థియేటర్లు ఉండేవి. మా ఫాదర్‌కి కాస్త సినిమా పిచ్చి ఎక్కువే.

* రవితేజ (Ravi Teja)కి, నాకు పోలికలు ఉన్నాయని చాలా మంది చెప్పారు. షూటింగ్‌లోని కొన్ని కొన్ని షాట్స్‌లో.. ‘అబ్బాయ్ నేను వెళుతున్నా.. నువ్వు నుంచో’ అని రవితేజ వెళ్లిపోయేవారు.

* నేను అసోసియేట్‌గా ఉన్నప్పుడు.. చిరంజీవి (Chiranjeevi) గారు ‘ఏయ్.. బక్క రవితేజ ఎక్కడ?’ అని అనేవారు.

* ఒకసారి నా బర్త్‌డే రోజు షూటింగ్‌లో ఉండగా.. చిరంజీవిగారు, అరవింద్‌ (Allu Aravind)గారు స్పాట్‌‌కి వచ్చారు. వెంటనే ఒక వాచ్ తెప్పించి గిఫ్ట్ ఇచ్చారు. ఆ వాచ్ ఇస్తూ.. ఈ రోజు నుంచి నీ టైమ్ బాగుంటుందని చిరంజీవిగారు చెప్పారు.

* తమిళ వాళ్లు తీసే రా సినిమాలు మనమెందుకు తీయకూడదు, ఎందుకు మన సినిమా రిఫరెన్స్ అవకూడదు.. అలా అనుకునే ‘క్రాక్’ (Krack Movie) సినిమా చేశాను

* ‘క్రాక్’ సినిమా చూసిన తర్వాత కఠారి కృష్ణ (Katari Krishna).. ‘నేను జయమ్మ (Jayamma)ని చంపలేదు కదా.. అదొక్కటే నచ్చలేదబ్బాయ్’ అని అన్నాడంట

* ఇప్పటి వరకు నేను చేసిన ఏ సినిమాకు.. నిర్మాతలు పూర్తిగా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు.. ఒక్క ‘వీరసింహారెడ్డి’కి మాత్రమే పూర్తి రెమ్యూనరేషన్ వచ్చింది. ‘క్రాక్’ అంత పెద్ద హిట్ అయినప్పటికీ పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వలేదు.

* రేంజ్ అనేది మనం డిసైడ్ చేసేది కాదు. కానీ గోపీచంద్ సినిమా అనే ఒక మార్క్ ఉండాలి.

* పెళ్లి కూడా సినిమాటిక్‌గానే జరిగింది. చూడగానే అమ్మాయి నచ్చేసింది. పెద్దవాళ్లు అంగీకరించలేదు. సినిమా వాళ్లకి మేము ఇవ్వమన్నారు.. ఇలాంటి ఎన్నో విషయాలను గోపీచంద్ మలినేని ఈ కార్యక్రమంలో షేర్ చేసుకున్నారు. ఆ విషయాలన్ని తెలియాలంటే ఆదివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ABN ఆంధ్రజ్యోతిలో ప్రసారమయ్యే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (Open Heart with RK) ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Updated Date - 2023-01-20T21:38:29+05:30 IST