Athadu Re-Release : 'అతడు' భారీ కటౌట్స్
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:54 PM
అతడు.. బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన హీరో. రీ రిలీజుల్లో రికార్డులు సృష్టించిన హీరో కూడా అతడే. అందుకే అతడి పేరు వింటేనే అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. అందుకే ఈ సారి బర్త్ డే కే అతడికి మరుపురాని గిఫ్ట్‌ను ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో ‘అతడు’ (Athadu) ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas) దర్శకత్వంలో రూపొందిన కల్ట్ క్లాసిక్, ఇప్పటికీ టీవీల్లో చూస్తే రిమోట్‌ను పక్కన పెట్టేలా చేస్తుంది. 2005లో విడుదలైన ఈ సినిమా, మహేష్ బాబు స్టైల్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్‌లతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ ఏడాదికి సినిమా విడుదలై 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ సారి భారీ స్థాయిలో సెలబ్రేషన్స్‌కు రెడీ అవుతున్నారు అభిమానులు.
ఇక ఈ సినిమా మరోసారి థియేటర్లలోకి రానుంది. రీమాస్టర్డ్ వెర్షన్‌తో 2025 ఆగస్టు 9న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో కొత్త సినిమాను మించి సంబరాలు జరుపుతున్నారు అభిమానులు. వారం ముందే సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్, కూకట్ పల్లి- విశ్వనాథ్ థియేటర్‌ల వద్ద మహేష్ బాబు భారీ కటౌట్‌లను ఏర్పాటు చేశారు.
ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కు తగ్గట్టే బుకింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఈ రీ-రిలీజ్ ఘన విజయం సాధించనుందని అంచనా వేస్తున్నారు. రీ రిలీజుల్లోకూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు. సినిమా యూనిట్ కూడా 20 ఏళ్ల సెలబ్రేషన్స్‌కు గ్రాండ్ గా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో అభిమానుల సంతోషం రెట్టింపు కానుంది.
Read Also: NTR Cover Page: ‘ఎస్క్వైర్ ఇండియా’ మ్యాగజైన్ కవర్‌పై ఎన్టీఆర్
Read Also: Hrithik Roshan: ఆ ఫలితం నాకు తెలిసింది.. మీరూ ట్రై చేయండి..