Mahesh - Rajamouli: మార్చి నుంచి రాజమౌళి కొత్త సినిమా?

ABN , First Publish Date - 2023-01-30T15:04:20+05:30 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)విడుదలై మార్చి 24వ తేదీకి ఏడాది కావొస్తుంది. ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటింది.

Mahesh - Rajamouli: మార్చి నుంచి రాజమౌళి కొత్త సినిమా?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)విడుదలై మార్చి 24వ తేదీకి ఏడాది కావొస్తుంది. ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటింది. జపాన్‌లోనూ ఈ చిత్రం ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. పైగా అక్కడ 100 రోజుల మార్క్‌ను దాటింది.. ఇటీవల లాస్‌ ఏంజెల్స్‌లో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకుంది. ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ నామినేషన్స్‌లోనూ చోటు చేసుకుంది. దీంతో చిత్ర బృందం అంతా సెలబ్రేషన్స్‌లో ఉంది. దర్శకుడు రాజమౌళి అయితే ఇప్పటి అవార్డులు, ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనిని బట్టి చూస్తే రాజమౌళి మరో సినిమాను ట్రాక్‌ ఎక్కించాలంటే చాలా టైమే పట్టేలా ఉంది. (Rajamouli- MAhesh movie in march)

ప్రేక్షకులు మాత్రం ఆయన నుంచి కొత్త చిత్రం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎదురు చూడడం అంటే సినిమా విడుదల కోసం కాదు... సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని. సూపర్‌స్టార్‌ మహేశ్‌తో రాజమౌళి ఓ సినిమా కమిట్‌ అయ్యారు. ఆ సినిమా సెట్స్‌ మీదకెళ్లేది ఎప్పుడా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ గుడ్‌న్యూస్‌ బయటకు వచ్చింది. (SS Rajamouli Next movie starts in march)

మహేశ్‌ - రాజమౌళి కాంబినేషన్‌లో ఈ చిత్రంలో జనవరిలో మొదలు కావాల్సి ఉందని వార్తలొచ్చాయి. అది కుదరకపోవడంతో ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు మొదలవుతాయనే వార్త ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొట్టింది. తాజా సమాచారం ప్రకారం మార్చిలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభించడానికి ముహూర్తం కుదిరిందని చిత్ర బృందం నుంచి సమాచారం. ప్రస్తుతం మహేశ్‌.. త్రివిక్రమ్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. మార్చి నుంచి రాజమౌళి సినిమా కోసం డేట్లు కేటాయించారని, ప్యారలల్‌గా రెండు సినిమాలకు మహేశ్‌ షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. యాక్షన్‌ అడ్వెంచర్‌ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని కె.ఎల్‌ నారాయణ నిర్మించనున్నారు.

Updated Date - 2023-01-30T15:04:21+05:30 IST