Mahesh - Aamir Khan: నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టిస్తుంది..

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:58 PM

ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’ చిత్రం చూసి టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఏమన్నారంటే

ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’కు (Sitare zameen par) టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఫిదా అయ్యారు. ఈ సినిమాను వీక్షించిన మహేశ్‌ (Mahesh Babu) ఆమిర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘సితారే జమీన్‌ పర్‌’ అద్భుతమైన సినిమా. ఆమిర్‌ ఖాన్‌ ఇతర క్లాసిక్‌ సినిమాల్లాగానే  ఇది కూడా మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, చప్పట్లు కొట్టేలా చేస్తుంది. ‘సితారే జమీన్‌ పర్‌’ చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకు వస్తారు’’ అంటూ చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచేశారు.

SITARE.jpg




ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరి హృదయాలను కదిలించింది. కొందరి నవ్వుల్లో ముంచింది. సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రేక్షకులు వరకూ అందరి మనసులను దోచుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి నెటిజన్లు పాజిటివ్‌గా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విడుదలకు ముందు ఏర్పాటుచేసిన ప్రీమియర్‌ షోలకు ప్రముఖులు ప్రశంసలు అందుకుందీ చిత్రం. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కూడా చక్కని రివ్యూ ఇచ్చారు. బాలీవుడ్‌ హీరోలు షారుక్‌ఖాన్‌, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి దీనిపై ప్రశంసలు కురిపించారు. మానసిక దివ్యాంగులను తక్కువ చేసి చూడకూడదనే సందేశాత్మక చిత్రమిదన్నారు. ఈ సినిమా సమాజంలో మార్పు తీసుకురాగలదని సెలబ్రిటీలు అభిప్రాయపడ్డారు. ‘తారే జమీన్‌ పర్‌’కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రమిది మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న వాళ్లకు ఓ కోచ్‌ బాస్కెట్‌ బాల్‌ క్రీడలో శిక్షణ ఇచ్చి, వాళ్లను మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దే ఇతివృత్తంగా రూపొందింది. ఆమిర్‌ఖాన్‌ ఇందులో కోచ్‌గా కనిపించారు.

Updated Date - Jun 23 , 2025 | 01:15 PM