Pawan Kalyan: రజనీకాంత్ 50 వసంతాలు జర్నీ.. స్ఫూర్తిదాయకం..
ABN, Publish Date - Aug 16 , 2025 | 06:54 PM
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Pawan Kalyan) శుభాకాంక్షలు చెప్పారు. నటుడిగా స్వర్ణోత్సవ సంబరాలు చేసుకుంటున్న రజనీకాంత్ మరిన్ని విభిన్న పాత్రల్లో నటించి సినీ అభిమానులను అలరించాలని ఆయన అభిలషించారు.
తెరపై ‘సూపర్ స్టార్ రజని’ అని టైటిల్ కనిపించగానే థియేటర్లు ఏ విధంగా మార్మోగుతాయో పలుమార్లు చెన్నైలో చూశా. తరాలు మారినా సినీ ప్రియుల్లో ఆయన మీద అభిమానం క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆ స్థాయి అభిమానులను దక్కించుకున్న కథానాయకుడు రజనీకాంత్. నటుడిగా అయిదు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. సినీ జీవితంలో స్వర్ణోత్సవం చేసుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌కి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆయన ఏ పాత్ర పోషించినా తనదైన స్టైల్‌ను చూపించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఆయన నడకలో, సంభాషణలు పలకడంలో, ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రత్యేకతను చూపిస్తారు. రజనీకాంత్ స్టైల్‌కి నవతరం ప్రేక్షకుల్లోనూ అభిమానులున్నారు. నటుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరిన ఆయన మహావతార్ బాబాజీ భక్తుడిగా ఆధ్యాత్యిక విషయాలపై, యోగా సాధనపై ప్రత్యేక శ్రద్థ చూపడం ఆయనలో భక్తి భావాన్ని ధార్మిక విశ్వాసలను తెలియచేస్తుంది. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యా?ని, సుఖసంతోషాలు అందించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
ALSO READ: Aamir Khan: రజనీతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కోట్లతో సమానం..
Hearty Singh: ఈ పిల్లాడు ఎవరో గుర్తు పట్టారా... వార్ 2లో ఆ పాత్ర ...
OG Movie: 'ఓజీ'.. ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది