Hearty Singh: ఈ పిల్లాడు ఎవరో గుర్తు పట్టారా... వార్ 2లో ఆ పాత్ర ...

ABN , Publish Date - Aug 16 , 2025 | 06:04 PM

కొన్నిసార్లు సినిమాల్లో అస‌లు విష‌యం కంటే కూడా కొస‌రు మేట‌ర్లు ఇంట్రెస్టింగ్‌గా మారుతుంటాయి. క‌థ‌, క‌థ‌నాల కంటే కూడా క్యారెక్టర్లు వెంటాడుంటాయి. రీసెంట్ రిలీజ్ 'వార్2' సినిమాలో అలాంటిదే ఓ ఈ విష‌యం ఆస‌క్తిరేపుతోంది. బుర్రబ‌ద్దలు కొట్టుకున్నా చాలా మందికి అదేంటో తెలియ‌డం లేదు.

ప్రస్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లతో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న మూవీ 'వార్ 2' ( War2). మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr), బీటౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) కాంబినేష‌న్‌లో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మాస్ పీస్.. బిగ్ స్క్రీన్‌పై అద‌ర‌గొడుతోంది. ఇద్దరు హీరోల పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోల కంటే కూడా ఓ ఇద్దరు యాక్టర్లపై తెగ చ‌ర్చ న‌డుస్తోంది.


‘వార్ 2’లో ఎన్టీఆర్, హృతిక్‌లకు చిన్నతనం నుంచి కనెక్ట్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లాష్‌బ్యాక్ ఉంది. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో వాళ్ల చిన్నప్పటి పాత్రలను ఇద్దరు బాల నటులు పోషించారు. అయితే ఈ బాల నటులు ఎవరా అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఎక్కడో చూశాం అనిపిస్తోంది, కానీ ఎవరు? అని జనాలు గుర్తు చేసుకోలేక తిక‌మ‌క‌ప‌డుతున్నారు. అయితే, ఎట్టకేల‌కు ఈ సీక్రెట్ రివీల్ అయింది.

ఎన్టీఆర్, హృతిక్ రోష‌న్ చిన్నత‌న‌నం క్యారెక్టర్లు చేసిన‌వారిలో హృతిక్ కంటే తారక్ రోల్ ని చేసిన బాల నటుడుకి మంచి మార్కులు పడ్డాయి.. ఈ పిల్లాడి యాటిట్యూడ్, యాక్టింగ్ సూపర్‌గా కుదిరాయి. తెలుగు ఆడియెన్స్‌కు కూడా ఈ పిల్లాడు ఎక్కడో చూసినట్టు అనిపించినా, ఎవరో గుర్తు ప‌ట్టలేదు. ఇంతకీ ఆ పిల్లాడు ఎవరంటే? ఈ ఎనిమిదేళ్ల చిన్నోడు గతంలో ఓ సర్ఫ్ యాడ్‌లో “పోరా పో... పోర్ రబ్ పోర్.. ప్రతి ఇంటిని యాడ్‌తో ప‌ల‌క‌రించాడు . ఈ పిల్లాడి పేరు హార్టీ సింగ్ (Hearty Singh) . ‘వార్ 2’లో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో అతని యాగ్రెసివ్ పెర్ఫార్మెన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించి, భారీ ప్రశంసలు అందుకున్నాడు. పిల్లాడి జోరు చూస్తుంటే మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు కొట్టేసేలా కనిపిస్తున్నాడు.

Read Also: Karan Johar: బాలీవుడ్‌లో దర్శకుల సంక్షోభం

Read Also: Raj Kundra: స్వామీజీకి కిడ్నీ దానం.. ఆ కేసును కప్పి పుచ్చడానికే

Updated Date - Aug 16 , 2025 | 06:04 PM